BigTV English

IND vs Pak: పాకిస్తాన్ ఓడిపోతే.. టీవీలు పగలకొట్టే వాడు ఎవడు లేడు..?

IND vs Pak: పాకిస్తాన్ ఓడిపోతే.. టీవీలు పగలకొట్టే వాడు ఎవడు లేడు..?

IND vs Pak: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఉత్కంఠ. క్రికెట్ మైదానంలో దాయాది దేశాల సమరం అంటే ఉద్రిక్తతలు సామాన్యంగా ఉండవు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుదేశాల అభిమానులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు పెద్ద పండుగతో సమానం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే.. క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం ఈ మ్యాచ్ పైనే ఉంటుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఏ జట్టు ఓడిపోయినా.. ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.


 

ఇలా ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇరుదేశాల అభిమానులు టీవీల ముందే కూర్చుంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాకిస్తాన్ లు ఇప్పుడు ఒకే గ్రూప్ లో తలపడబోతున్నాయి. అయితే ఎప్పుడైనా పాకిస్తాన్ పై భారత్ గెలిస్తే ఇక్కడి అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. అలాగే మిఠాయిలు పంచుకుంటారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం అక్కడి అభిమానులు వారి జట్టు ఓడిపోతే ఆగ్రహాన్ని టీవీల పైన చూపిస్తూ ఉంటారు. రోడ్లపైకి టీవీలను తీసుకువచ్చి పగలగొడతారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్.. నేడు భారత్ తో జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కానీ ఇప్పటివరకు జరిగిన ఐసీసీ మ్యాచ్లలో పాకిస్తాన్ పై భారత జట్టుదే పై చేయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే అక్కడి అభిమానులు విపరీత చర్యలకు దిగి మళ్ళీ టీవీలు పగలగొడతారేమోనని అంతా అనుకుంటారు. కానీ ఈసారి మాత్రం అలా జరగదని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ. ఈ మ్యాచ్ లో ఒకవేళ భారత్ పై పాకిస్తాన్ జట్టు ఓడిపోయినా అభిమానులు టీవీలపై తమ ప్రతాపాన్ని చూపించలేరని అంటున్నాడు.

ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ద్రవయోల్బణం కారణంగా పాకిస్తాన్ వాసుల జీవనం పాతాళానికి పడిపోయింది. చిన్న చిన్న వస్తువులకు కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో పాకిస్తాన్ అభిమానులు టీవీలు పగలగొట్టేంత సాహసం చేయరని అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే దాదాపు ఛాంపియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే.

 

ఇక నేడు జరగబోయే ఈ మ్యాచ్ లో భారత జట్టే ఫేవరెట్ అని అన్నారు బాసిత్ అలీ. ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోతే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ సమతూకంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వారు గనక ఫామ్ లోకి వస్తే ఇక పాకిస్తాన్ గెలుపు అవకాశాలు వదులుకోవాల్సిందేనని అన్నాడు. ఇక మరోవైపు ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలవాలని అభిమానులు తమ ఇష్టదైవాలకు ప్రార్ధనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తూ.. సోషల్ మీడియాలో టీమిండియాని ఉత్తేజపరిచే పోస్ట్ లు చేస్తున్నారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×