BigTV English

Vijay Sethupathi: ఆ విషయం నాకు కూడా తెలియదు.. విజయ్ సేతుపతిని షాక్‌కు గురిచేసిన విజయ్..

Vijay Sethupathi: ఆ విషయం నాకు కూడా తెలియదు.. విజయ్ సేతుపతిని షాక్‌కు గురిచేసిన విజయ్..

Vijay Sethupathi: హీరోలుగా అవకాశాలు వచ్చిన తర్వాత చాలామంది యాక్టర్లు విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఇష్టపడరు. పాత్రకు ప్రాముఖ్యత ఉంటే చాలు.. హీరో కాకపోయినా ఓకే అని ఆలోచించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలా వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపిస్తూ ఉంటేనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగలుగుతారు. అలా ఎన్నో పాత్రలతో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో నిరూపించుకొని తన సత్తా చాటుకున్నాడు విజయ్ సేతుపతి. తమిళ ప్రేక్షకుల దృష్టిలో మక్కళ్ సెల్వన్‌గా మారాడు. తాజాగా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో హీరో విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్ సేతుపతి.


విలన్‌గా అదుర్స్

విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ (Master) సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులో హీరోగా విజయ్‌కు ఎంత గుర్తింపు లభించిందో విలన్‌గా భవానీ పాత్రకు కూడా అంతే క్రేజ్ లభించింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా భవానీ పాత్రకు ఫిదా అయిపోయారు. అందులోనూ విజయ్ సేతుపతి ఆ పాత్రలో నటించడంతో దానికి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికే ఎన్నోసార్లు ‘మాస్టర్’ సినిమాలో విజయ్‌తో కలిసి నటించడం తనకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు విజయ్ సేతుపతి. తాజాగా మరోసారి తన పాల్గొన్న ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడాడు.


స్పెషల్ సినిమా

‘‘మాస్టర్ సినిమా నా కెరీర్‌లో స్పెషల్ ప్లేస్‌లో ఉంటుంది. దళపతి విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో నటించడం నాకు చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. విజయ్ చాలా మంచివాడు’’ అంటూ మరోసారి హీరోను ప్రశంసల్లో ముంచేశాడు విజయ్ సేతుపతి. చాలామంది ప్రేక్షకులు ‘మాస్టర్’ యావరేజ్ సినిమానే అయినా అందులో విజయ్ సేతుపతి విలన్‌గా చేయడం వల్లే హైలెట్ అయ్యిందని కూడా అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తను ప్లే చేసిన బెస్ట్ విలన్ రోల్స్‌లో ‘మాస్టర్’ మొదటి స్థానంలో ఉంటుందని అంటారు. ఇక విజయ్ అనుకోకుండా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడంపై కూడా విజయ్ సేతుపతి మాట్లాడాడు.

Also Read: మీరు చేయకపోతే వాళ్లు చేసేవాళ్లు.. ఐశ్వర్య, మీనాక్షిలకు అనిల్ రావిపూడి కౌంటర్

పొలిటికల్ ఎంట్రీ

విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి, సినిమాలను వదిలేస్తాడనే విషయం తనతో కలిసి ‘మాస్టర్’ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలియదని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). విజయ్ (Vijay) నిర్ణయం విన్న తర్వాత ప్రేక్షకులలాగానే తాను కూడా షాక్ అయ్యానని అన్నాడు. ఆ విషయం తనకు కూడా ముందు తెలియదని చెప్పాడు. ఇక విజయ్‌లాగానే తనకు కూడా పాలిటిక్స్‌‌లోకి ఎంటర్ అయ్యే ఆలోచన ఉందా అని అడగగా.. తనకు తెలియదని సమాధానమిచ్చాడు. అంటే నో అనే ఆన్సర్ రాలేదు కాబట్టి విజయ్ సేతుపతికి కూడా పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ ఉందేమో అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. అలా అని సినిమాలు వదిలేయకుండా ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×