BigTV English

Worst foods: మీ జీవిత కాలాన్ని తగ్గించే ఆహారాలు ఇవన్నీ, తినడం తగ్గిస్తే మీకే మంచిది

Worst foods: మీ జీవిత కాలాన్ని తగ్గించే ఆహారాలు ఇవన్నీ, తినడం తగ్గిస్తే మీకే మంచిది

మనం రోజూ తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మన శరీర నిర్మాణంలో మానసిక, శారీరక ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేవి మనం తినే ఆహారాలే. కొన్ని రకాల ఆహారాలు తినేటప్పుడు రుచిగా ఉన్నా అవి దీర్ఘకాలంగా శరీరానికి హాని చేస్తాయి. అలాంటి పేలవమైన ఆహార ఎంపికలను మీరు కలిగి ఉంటే వాటిని తినటం మానేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆహారాలు అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యమైన శారీరక విధులకు అంతరాయం కలిగిస్తాయి. ఆయుష్షును తగ్గిస్తాయి. మన దీర్ఘాయుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనం తినే ఆహారాలలో మన ఆయుష్షును తగ్గించే కొన్ని రకాల ఆహారాలను ఇక్కడ ఇచ్చాము.


నిల్వ చేసిన మాంసాలు
మాంసాన్ని తాజాగా తినడమే మంచిది. పిజ్జా, బర్గర్, హాట్ డాగ్స్ వంటి వాటిలో ప్రాసెస్ చేసిన, నిల్వ చేసిన మాంసాలను వాడతారు. ఇలాంటివి తరచూ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. ఈ మాంసాల్లో నైట్రేట్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల మరణాల రేటు పెరుగుతున్నట్టు వివరించింది. అలాగే క్యాన్సర్ ప్రమాదం, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి మాంసాలలో సంతృప్త కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు గుండె జబ్బులకు కారణం అవుతాయి.

బ్రెడ్, పాస్తా, బియ్యం
ఎంతోమంది తమ ఆహారంలో ప్రతిరోజు పాలిష్ బియ్యము, వైట్ బ్రెడ్, పాస్తా, మైదాతో చేసిన నూడుల్స్ వంటివి అధికంగా తింటూ ఉంటారు. ఇవి ప్రాసెస్ చేసిన ఆహారాలు. కాబట్టి ఫైబర్ లో విటమిన్లు, ఖనిజాలు వంటివి తక్కువగా ఉంటాయి. పోషకాల కొరత వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చేస్తుంది. ఇది ఊబకాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి అలాంటి వాటిని తినడం తగ్గించి వాటికి బదులు బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ వంటివి తినడం ఉత్తమం.


డీప్ ఫ్రై చేసిన ఆహారాలు
నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఆనియన్ రింగ్స్ వంటివి అందరూ ఇష్టంగా తింటారు. ఇలాంటివి తినడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిలో హానికరమైన సమ్మేళనాలు పుడతాయి. వేయించిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ.

చిప్స్, స్నాక్స్
బయట చిప్స్, కురుకురే వంటి ప్యాక్ చేసిన స్నాక్స్ అధికంగానే దొరుకుతాయి. వీటిని అధికంగా ఉప్పు వేసి తయారుచేస్తారు. ఇలా ఉప్పు వేయడం వల్ల అవి ఎక్కువకాలం పాటూ నిల్వ ఉంటాయి. వీటిని తినడం వల్ల సోడియం ఎక్కువగా శరీరంలో చేరుతుంది. అవి కిడ్నీ సమస్యలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి కారణమవుతుంది. కాబట్టి ప్యాక్ చేసిన స్నాక్స్ తినకపోవడం మంచిది.

Also Read: చికెన్ కర్రీ, వేపుళ్లలో నిమ్మకాయ పిండుకుని మరీ తింటున్నారా? జరిగేది ఇదే!

ఆర్టిఫిషియల్ స్వీటనర్లు
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బయట కృత్రిమ స్వీటనర్లు దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి రోగాలు రావని అనుకుంటారు. నిజానికి ఇలాంటి స్వీటనర్లు తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యానికి ఆటంకం కలుగుతుంది. జీవక్రియ సమతుల్యతకు దారితీస్తుంది. కాబట్టి కృత్రిమ స్వీట్నర్లను తినడమే మానేయాలి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×