Vidudhala Part 2 First Review : తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ సేతుపతి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఉప్పెన వంటి సినిమాలో విలన్ చేసి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘విడుదల పార్ట్ 2’ రిలీజ్‌కు సిద్ధమైంది.. ఈ సినిమా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, మక్కళ్ సెల్వన్ టీమ్ హైదరాబాద్‌లో ప్రమోషన్లలో భాగంగా సందడి చేసింది. తాజాగా సెన్సార్ ను పూర్తి ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం..
“విడుదల పార్ట్ 2″మూవీ స్టోరీ ఎలా ఉందంటే..?
విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ సేతుపతి.. విడుతలై పార్ట్ -2. కొలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను ఏడాది డిసెంబర్ 20వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి మంజు అలాగే విజయ్ సేతుపతి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమాలో కేవలం 8 రోజుల నిడివి కోసం మాత్రమే తనను తీసుకున్నారని, కానీ 120 రోజులపాటు షూటింగ్ చేశారని తెలిపారు విజయ్ సేతుపతి. అలాగే మంజు కూడా తనది క్యామియో రోల్ అని చెప్పిన ఈమె.. ఆ తర్వాత తన పాత్ర ఈ సినిమాకి అత్యంత కీలకమని కూడా చెప్పుకొచ్చింది.. దాంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్ కొట్టినట్లేనా..?
విజయ్ సేతుపతి మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.. గతంలో వచ్చిన విడుదల పార్ట్ 1 బాగుంది. ఇక పార్ట్ 1 బాగుంటడంతో పార్ట్ 2పై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ, విడుదల పార్ట్ 2 ఆడియన్స్ ఆకట్టుకోవడం విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. కథలో బలం ఉన్నా.. కధనం స్లోగా ఉండటం సినిమాకు చాలా మైనస్ కాబోతుందని సమాచారం.. మొదటి పార్ట్ పాజిటివ్ టాక్ వచ్చిన 2:40 గంటలు ఉన్న నిడివి కొంత మేర ప్రభావం చూపింది. దాన్ని గుణపాఠంగా అయినా తీసుకుకోకుండా పార్ట్ 2 ను ఏకంగా 2:52 గంటలు పెట్టారు.. ఈ 2:52 గంటలు ఉన్న నిడివే సినిమాకు పెద్ద మైనస్ కాబోతుందట. ల్యాగ్ సన్నివేశాలు చాలా ఎక్కువ ఉన్నాయట. ఇక మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎప్పటిలాగే సూపర్ గా ఉందట.
సూరీ క్యారెక్టర్ ను మరింత యూజ్ చేసి ఉంటే బాగుండు అనే ఫీల్ వస్తదట సినిమా చూస్తే.. మొత్తానికి విజయ్ వన్ మ్యాన్ షో అయ్యేలా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, మంజు, సూరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, రెడ్ జాయింట్ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సౌండ్ ట్రాక్ అందిస్తున్న విషయం తెలిసిందే.. భారీ అంచనాలతో డిసెంబర్ 20 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..