Vidudala 2 : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విడుదల 2’ (Vidudala 2). థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని విజయ్ సేతుపతి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఎక్స్టెండెడ్ వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ స్పందించారు.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మూవీ ‘విడుదల 2’ (Vidudala 2). ‘మహారాజా’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో ‘విడుదల 2’ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. ఇందులో మంజు వారియర్ హీరోయిన్ గా నటించగా, సూరి మరో లీడ్ రోల్ పోషించారు. ‘విడుదల 2’ మూవీలో విజయ్ సేతుపతి నక్సల్ పెరుమాళ్ అలియాస్ మాస్టర్, ప్రజాదళం నాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ వెట్రిమారన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వెట్రిమారన్ ‘విడుదల 2’ (Vidudala 2) మూవీ ఓటీటీ వర్షన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వెట్రిమారన్ మాట్లాడుతూ “విడుదల పార్ట్ 2 ఎక్స్టెండర్ వెర్షన్ ను ఓటిటిలో రిలీజ్ చేసి ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాము. థియేటర్ వెర్షన్ కు మరో గంట నిడివి ఉన్న ఫుటేజ్ ను యాడ్ చేసి, దాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. నిజానికి యూఎస్ వర్షన్ ప్రింట్, మన ప్రింట్ కు మధ్య రన్ టైమ్ విషయంలో దాదాపు 8 నిమిషాల తేడా ఉంటుంది. మన ప్రింట్లో చివరి నిమిషంలో ఉన్న ఫుటేజ్ ని తొలగించాల్సి వచ్చింది. విడుదల పార్ట్ 1, 2… మొత్తం కలిపి సుమారు 8 గంటల నిడివితో ఉంటుంది. కానీ దీన్ని థియేటర్ వర్షన్ కు అనుగుణంగా కట్ చేసి రిలీజ్ చేయడం వల్ల చాలా సీన్స్ ను కట్ చేసాము” అంటూ చెప్పి సర్ప్రైజ్ చేశారు.
మొత్తానికి థియేటర్ వెర్షన్ కాకుండా ఏకంగా గంట నిడివిని యాడ్ చేసి, ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా గతేడాది పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన ‘విడుదల’ మూవీకి సీక్వెల్ గా ‘విడుదల 2’ (Vidudala 2) వచ్చింది. ఈ మూవీలో మాస్టర్ పెరుమాళ్ జమిందారి వ్యవస్థ వల్ల జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో ఆయన ఒక దళానికి నాయకుడిగా ఎలా మారాడు? ఆ ఉద్యమంలో మహాలక్ష్మితో పెరుమాళ్ ప్రేమ ఎక్కడికి దారి తీసింది? పెరుమాళ్ ని పట్టించిన కానిస్టేబుల్ పరిస్థితి ఏమైంది? వంటి విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ‘విడుదల 2’ ఓటీటీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం 2025 జనవరి రెండవ లేదా మూడవ వారంలో ZEE5లో ప్రసారం అవుతుందని టాక్ నడుస్తోంది.