HBD Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గురించి ప్రత్యేకంగా సౌత్ ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ‘మహారాజా’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సేతుపతి, చివరగా ‘విడుదల 2’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ‘జవాన్’ మూవీతో ఆయన బాలీవుడ్ కి కూడా పరిచయమయ్యారు. విలక్షణ నటుడిగా, సౌత్ లోని బిజీయస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి పుట్టినరోజు ఈరోజు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు, కలలతో అడుగు పెడతారు. కానీ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అంచలంచెలుగా ఎదిగి, నేడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి… తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా విజయ్ సేతుపతి ఆస్తులు ఎన్ని కోట్లు అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
విజయ్ సేతుపతి ఆస్తులు
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఆస్తుల చిట్టాలో ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లతో పాటు రియల్ ఎస్టేట్ వంటివి బాగానే ఉన్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కి దాదాపు 50 లక్షలు చార్జ్ చేస్తాడు. ‘జవాన్’ సినిమా కోసం ఈ హీరో ఏకంగా 21 కోట్లు తీసుకున్నారు. విజయ్ సేతుపతికి ఇదే హిందీలో మొదటి సినిమా. ఇక ఒక్కో సినిమాకి ఆయన రూ. 30 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బిగ్ బాస్ తమిళ (BiggBoss Tamil Season 8) షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి ఆయన రూ. 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి ఇప్పటిదాకా 50 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 140 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. విజయ్ సేతుపతి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెట్టారని టాక్ నడుస్తోంది. ఆ టాక్ ప్రకారం విజయ్ సేతుపతి కి చెన్నైలో, ఎన్నూర్ లలో 100 ఎకరాలకు పైగానే స్థలాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే చెన్నైలో విజయ్ సేతుపతికి 50 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా కూడా ఉంది.
విజయ్ సేతుపతి కార్ల కలెక్షన్
ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్ల కలెక్షన్ ఉండడం విశేషం. విజయ్ సేతుపతి గ్యారేజీలో రూ. 1.81 కోట్ల విలువైన జర్మన్ సెడాన్, రూ. 1.60 కోట్ల బీఎండబ్ల్యూ, రూ. 39.5 కోట్ల విలువైన మినీ కూపర్, టయోటా, ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.