Axar patel – Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ముగిసినప్పటినుండి ఐపిఎల్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. రాబోయే ఐపీఎల్ 2025 మెగా లీగ్ కోసం జట్లు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మెగా వేలంలో పలు జట్లు తమ కేప్టెన్లను వదులుకోగా.. మరికొన్ని జట్లు తమ కెప్టెన్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే వేలంలో వెళ్లిన పలు జట్ల కెప్టెన్లు ఈ సారి ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Gambhir – Sarfaraz: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్.. సర్ఫరాజ్ కు గంభీర్ వార్నింగ్
ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2024 వరకు ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ని.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆ జట్టు వదిలిపెట్టగా.. ఇప్పుడు ఆ జట్టుకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు.? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే లక్నో సూపర్ జెంట్స్ మాజీ కెప్టెన్, భారత స్టార్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ని 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు వేలంలో దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రేసులో మరో భారత ఆల్రౌండర్ ఉన్నారని పలు కథనాలు వెలువడుతున్నాయి. అతడు ఎవరో కాదు భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఇతడు ఢిల్లీ కెప్టెన్ రేసులో ఉన్నాడని గతంలో ఢిల్లీ టీమ్ సహా యజమాని పార్ధ్ జిందాల్ వెల్లడించారు. ఇప్పుడు మరోసారి అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్ అంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రిటెన్షన్ పిక్ అయిన అక్షర్ పటేల్ ని రూ. 16.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారత జట్టు విషయానికి వస్తే త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే టి20 సిరీస్ కోసం ఇటీవల సెలక్టర్లు భారత్ టీమ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీమ్ కి సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ గా ప్రకటించి.. వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్ కి అప్పగించారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ కూడా బీసీసీఐ బాటలోనే అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అందుబాటులో లేని సందర్భంలో అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.
Also Read: IPL 2025: RCB కప్పు కొట్టాలని తెలుగోడి శబరిమల యాత్ర…?
ఢిల్లీ క్యాపిటల్స్ 2025 జట్టు: కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, నటరాజన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, హ్యారీ బ్రూక్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, సమీర్ రిజ్వీ, దర్శన్ నల్కండే, విప్రజ్ నిగమ్, దుష్మంత చమీర, దోన్నో చమీర , అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, కరుణ్ నాయర్.
🚨 CAPTAIN AXAR PATEL 🚨
– Axar patel likely to lead Delhi Capitals in ipl.
– KL Rahul will be playing as a wicket keeper batsman. pic.twitter.com/IVK96RuDt2
— Jonnhs.🧢 (@CricLazyJonhs) January 15, 2025