Puri Sethupathi : ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమాలతో డీలా పడిపోయాడు కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటేనే మంచి ఎక్స్పెక్టేషన్ ఉండేవి. చాలామంది హీరోలకు స్టార్ట్డం తీసుకొచ్చేలా ఉంటుంది పూరి ఫిలిం మేకింగ్. పూరి జగన్నాథ్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేశాయి. ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో ఆంధ్రావాలా అనే సినిమాను చేశాడు పూరి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా టైం పట్టింది. మళ్లీ టెంపర్ సినిమాతో మీరిద్దరూ కలయిక మొదలైంది. టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కు సరైన సక్సెస్ఫుల్ సినిమా పడలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా పరవాలేదు అనిపించుకుంది.
ఇస్మార్ట్ కం బ్యాక్
ఒక పూరి జగన్నాథ్ టెంపర్ సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూనే ఉంది. రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. అయితే ఈ సినిమా ఊహించని డిజాస్టర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
భారీ కాస్ట్
పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే అందరికీ మంచి అంచనాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపిస్తున్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇంకొంతమంది నటిస్తున్నట్లు రోజుకొకరి పేరు బయటకు వస్తుంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. అలానే దునియా విజయ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా నివేదా థామస్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇంతమంది స్టార్ కాస్ట్ ను చూస్తూ ఉంటే పూరి ఈసారి గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడు అనిపిస్తుంది.
Also Read : NTRNeel: రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు