Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) చివరిగా నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. త్వరలో పూర్తిస్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన సినీ కెరియర్లో చివరి సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు విజయ్ దళపతి. ఇక ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) మరొకసారి విజయ్ దళపతితో రొమాన్స్ చేయడానికి సిద్ధం అయ్యింది. అలాగే ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిన మళయాల నటి మమిత బైజు (Mamita baiju) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా విలన్ గా నటిస్తున్నారు.
శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న సన్ నెట్వర్క్..
ఇక విజయ్ దళపతి సినీ కెరియర్ లోనే చివరి సినిమా కావడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొంది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పటికే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సుమారుగా రూ.121 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా ఆడియో రైట్స్ ను టి సిరీస్ కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు సాటిలైట్ హక్కుల కోసం కూడా విపరీతమైన పోటీ నెలకొంది.. ముఖ్యంగా కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్కు చెందిన సన్ నెట్వర్క్ జననాయగన్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా హక్కులను రూ.55 కోట్లకు దక్కించుకుందని తెలుస్తుంది. ఇక విజయ్ దళపతి చివరి సినిమా కావడంతో ఈ సినిమా రైట్స్ కోసం ఇంత డిమాండ్ ఏర్పడిందని ట్రేడ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు . ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తు ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Shalini Pandey: నాకు ఆమెతో పోలికేంటి..? ఫైర్అవుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ
విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..
ఇక విజయ్ విషయానికి వస్తే 2024 ఫిబ్రవరి 2న “తమిళగ వెంట్రి కళగం” అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి సేవలు చేస్తూ అక్కడే జీవితాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ జీవితం ఈయనకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.. ఒక విజయ్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు తమిళ్లో తెరకెక్కించిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు. గత కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలవగా ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు విజయ్.