BigTV English

Thalapathy 69: విజయ్ దళపతికి జోడీగా సమంత.. హ్యాట్రిక్ కోసం బిగ్ ప్లాన్!

Thalapathy 69: విజయ్ దళపతికి జోడీగా సమంత.. హ్యాట్రిక్ కోసం బిగ్ ప్లాన్!

Thalapathy 69 movie update(Film news in telugu today): కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో చిత్రాలు తెలుగులో చేసి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో సినిమా వస్తుందంటే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫుల్ హైప్ ఉంటుంది. థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. ఈ హీరో గతేడాది దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘లియో’ మూవీ చేశాడు.


భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తెలుగులో మాత్రం పర్వాలేదనిపించుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం వీర లెవెల్లో వచ్చాయి. ఇందులో విజయ్‌ను ఫ్లాష్‌బ్యాక్‌లో మాస్‌గా చూపించారు. అలాగే ప్రజంట్ స్టోరీలో చాలా పిరికివాడిలా, భయస్తుడిలా చూపించడంతో చాలా మందికి కనెక్ట్ కాలేదు. ఏది ఏమైనా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి అదరగొట్టింది.

Also Read: స్టార్ హీరో విజయ్ దళపతి ‘GOAT’ సినిమా అప్డేట్‌లు వచ్చేస్తున్నాయ్.. సాంగ్ రిలీజ్..!


ఈ సినిమా తర్వాత విజయ్ తన కెరీర్‌లో 68వ సినిమాను చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ రెండు డిఫరెంట్ పాత్రలు చేస్తున్నాడు. అందులో ఒకటి తండ్రిగా.. మరొకటి కొడుకుగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇతర కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

గత నెలలో విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి చిన్న టీజర్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి మాటలు, డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ సన్నివేశాన్ని మాత్రమే చూపించారు. ఆ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే విజయ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో ఒక సినిమాను కమిట్ అయ్యాడు. అయితే ఈ మూవీ విజయ్ కెరీర్‌లో 69వ చిత్రంగా రూపొందనుంది. కాగా ఇదే విజయ్ చివరి సినిమాగా కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు మొదట తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆయన పేరు కాకుండా మరొకరి పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Also Read: విజయ్ బర్త్ డే.. కొత్త సినిమా స్పెషల్ వీడియో మామూలుగా లేదుగా..

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలో విజయ్‌కు జోడీగా హీరోయిన్‌ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంతను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిద్దరు ఇదివరకు తేరి, మెర్సల్ అనే సినిమాలలో నటించి మంచి హిట్లు అందుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్లు సాధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×