Thug Life TV Rights..ప్రముఖ సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan) కూడా వరుస పెట్టి యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఇప్పుడు తమిళ్ భాష గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చిత్రంగా రాబోతున్న చిత్రం థగ్ లైఫ్ (Thug life). మణిరత్నం (Maniratnam) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిరత్నం.. కమలహాసన్ తో కలసి స్క్రిప్ట్ రాయడం గమనార్హం. దీనిని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో కమల్ హాసన్ తో పాటు శింబు (Simbu), త్రిష కృష్ణన్(Trisha Krishnan), ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi), నాజర్(Nazar), అభిరామి (Abhirami), అశోక్ సెల్వన్(Ashok Selvan) , సన్యామల్హోత్ర (Sanya Malhotra), అలీ ఫజల్ (Ali Fazal), పంకజ్ త్రిపాటి(Pankaj Tripathi), రోహిత్ సరాఫ్, వైయాపురి, జోజు జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే 1987లో వచ్చిన ‘నాయకన్’ సినిమా తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఒక 2025 జూన్ 5 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాలు సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
భారీ ధరకు అమ్ముడుపోయిన టెలివిజన్ హక్కులు..
ఇకపోతే ప్రముఖ లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Net flix) ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.149.7 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే నాన్ థియేట్రికల్ హక్కులు కూడా రూ.210 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా టీవీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ టీవీ ఛానల్ గా పేరు సొంతం చేసుకున్న విజయ్ టీవీ (Vijay TV) ఈ సినిమా హక్కులను సుమారుగా రూ.60 కోట్లకు టెలివిజన్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే టీవీ హక్కులే ఈ రేంజ్ లో అమ్ముడుపోవడంతో కమలహాసన్ కాబట్టే ఆ రేంజ్ లో అమ్ముడుపోయాయని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు..ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కేవలం రూ.300 బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అప్పుడే ఓటీటీ, నాన్ థియేట్రికల్, శాటిలైట్ హక్కుల ద్వారా సుమారుగా రూ.419.7 కోట్లు లభించాయి. విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.
38 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్..
ఇకపోతే మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు సీనియర్ స్టార్ సెలబ్రిటీలంతా ఈ సినిమాలో భాగం అవడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగా ఇప్పుడు కమల్ హాసన్ కి ఉన్న మార్కెట్ అటు మణిరత్నం కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమా హక్కుల భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదలైన పాట , టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఏడు పదుల వయసులో కూడా కమలహాసన్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అటు కమలహాసన్ ఎటు రజనీకాంత్ (Rajinikanth ) ఇద్దరు కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.