Vijay Varma..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ప్రముఖ బాలీవుడ్ హీరో విజయ్ వర్మ (Vijay Varma) తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. సడన్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ కొన్ని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అటు తమన్నా..ఇటు విజయ్ ఎవరూ కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు నటుడు విజయ్ వర్మ రిలేషన్షిప్ పై చేసిన కామెంట్లు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ.. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే వాటిని స్వీకరించాలని, రిలేషన్షిప్ ను ఒక ఐస్ క్రీమ్ లా ఆస్వాదించాలి తప్ప దానిని కరిగిపోనివ్వకూడదు.. అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు విజయ్ వర్మ.
రిలేషన్షిప్ ఒక ఐస్ క్రీమ్ లాంటిది – విజయ్ వర్మ
విజయ వర్మ మాట్లాడుతూ.. “ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకోవాలి అంటే.. ఆ బంధంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలు, కష్టసుఖాలను పంచుకోవాలి. బంధం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది. దాన్ని ఆస్వాదిస్తేనే మనం మన బంధంలో ముందుకు సంతోషంగా సాగుతాము. ముఖ్యంగా చిరాకు, బాధ, కోపం, సంతోషం ఇలా ప్రతి అంశాన్ని కూడా స్వీకరించాలి. దాంతోపాటే ముందుకు సాగాలి” అని తెలిపారు విజయ్ వర్మ. మొత్తానికైతే రిలేషన్షిప్ ను ఐస్ క్రీమ్తో పోల్చడంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో తమన్నతో బ్రేకప్ ను ఉద్దేశించే విజయ్ వర్మ ఇలాంటి కామెంట్లు చేశారని నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
నిస్వార్ధమైన ప్రేమ కావాలి – తమన్నా..
ఇకపోతే మరొకవైపు తమన్నా కూడా ఇటీవల ప్రేమ గురించి కామెంట్లు చేసింది. “ప్రేమను ఎప్పుడైతే వ్యాపారలావాదేవీ గా చూడడం మొదలుపెడతామో.. అప్పుడే అసలైన సమస్యలు వస్తాయి. నిస్వార్ధంగా ఉన్న ప్రేమనే నేను నమ్ముతాను. ముఖ్యంగా భాగస్వామి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంటే రిలేషన్షిప్లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎవరు ఎదురుచూడద్దు.అద్భుతాలు మనమే సృష్టించాలి” అంటూ తెలిపింది. మొత్తానికైతే రిలేషన్ లో లేనప్పుడే ఈమె సంతోషంగా ఉన్నాను అని చెప్పడంతో విజయ్ వర్మతో బ్రేకప్ పై ఒక్కసారిగా ఇలా క్లారిటీ ఇచ్చేసింది తమన్నా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక సాధారణంగా ఎప్పుడు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇలా సడన్గా బ్రేకప్ గురించి మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also read:Rakul Preet Singh : నమ్మి మోసపోవడం కంటే దారుణమైనది ఇంకోటి లేదు – రకుల్..
తమన్నా కెరియర్..
ఇక తమన్నా విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ గా వస్తున్న ‘ఓదెల 2’ సినిమాలో తొలిసారి సాధ్వి గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై తమన్న అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు బాలీవుడ్ లో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు.. మరి ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూడాలి. ఏది ఏమైనా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుంది అనుకునే లోపు ఇలాంటి మాటలు బయటకు వినిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.