Vijay Devarakonda: ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణమే. అయితే కొన్ని రూమర్స్ నిజం కూడా అవుతాయి. ముఖ్యంగా నటీనటుల మధ్య ఉండే రిలేషన్ కు సంబంధించిన రూమర్స్ ఎక్కువగా వినిపిస్తుం ఉంటాయి. ఒక సినిమాలో నటించిన హీరోహీరోయిన్లు బయట కొద్దిగా చనువుగా కనిపించినా.. లేక ఇద్దరు కలిసి ఒక ఫోటో పెట్టినా వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇక ఎప్పటినుంచో ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మధ్య రిలేషన్ కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.
గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. అక్కడి నుంచేవీరి పరిచయం మొదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రష్మిక- విజయ్ లిప్ కిస్ లు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. ఇక గీతగోవిందం తరువాతనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్ మెంట్ ను రద్దుచేసుకుంది. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం విజయ్ అని.. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై.. రక్షిత్ ను వద్దు అని చెప్పిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక గీత గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమా చేశారు ఈ జంట. ఆ సినిమాతో వీరి ప్రేమ బలపడిందని టాక్ నడిచింది. విజయ్ కన్నా ఎక్కువ రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప, యానిమల్, పుష్ప 2.. ఇలా వరుస సినిమాలతో నేషనల్ క్రష్ గా మారింది. ఇంకోపక్క వీరిద్దరూ వెకేషన్స్, టూర్స్, ఫెస్టివెల్స్ అంటూ ఇద్దరు కలిసి కనిపించడం ఎక్కువైంది. సింగిల్ గా ఫోటోలు పెట్టినా కూడా వెనుక బ్యాక్ గ్రౌండ్ చూసి మరీ వీరిద్దరూ కలిసే ఉన్నారని గుర్తుపట్టేస్తున్నారు.
Priyanka Chopra: ‘బజార్’ ఎక్కిన మహేష్- రాజమౌళి బ్యూటీ.. ఆ అందం ఏంట్రా బాబు
ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నామని చెప్పిన ఈ జంట ఈ మధ్య రిలేషన్ లో ఉన్నట్లు హింట్లు ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ జంట.. జిమ్ నుంచి వస్తూ కెమెరా కంటపడింది. గత కొన్నిరోజుల క్రితం రష్మిక కాలికి గాయం అయిన సంగతి తెల్సిందే. కనీసం నడవలేక అయితే వీల్ చైర్ లోనో.. లేకపోతే వాక్ స్టిక్స్ తోనో నడుస్తుంది.
మొన్నటికి మొన్న ఛావా సినిమా ఈవెంట్ లో కూడా రష్మిక వీల్ చైర్ లోనే కనిపించింది. ఆ ఈవెంట్ లో రష్మికకు విక్కీ కౌశల్ ఎంతో హెల్ప్ చేశాడు. ఆమె చెయ్యి పట్టుకొని ఎంతో జాగ్రత్తగా స్టేజిమీదకు తీసుకొచ్చాడు. కానీ, విజయ్ మాత్రం రష్మిక వాక్ స్టిక్స్ తో నడుస్తున్నా.. కనీసం పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కనీసం ప్రేమించిన అమ్మాయి నడవడానికి కష్టపడుతుంది అని దగ్గరుండి తీసుకురాకుండా.. అలా వదిలేస్తావా.. ? ఇదేనా ప్రేమ అని నెటిజన్స్ విజయ్ పై మండిపడుతున్నారు. బుద్దుందా.. ? ముందు నువ్వెళ్ళిపోవడం కాదు.. వెనుక రష్మికను పట్టుకోవాలిగా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ జంట ఈ ఏడాది తమ ప్రేమ విషయాన్ని అధికారికం చేయనుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
మళ్లీ దొరికిపోయారు… ఒకే జిమ్లో రష్మిక – విజయ్#VijayDeverakonda #RashmikaMandanna #bigtvcinema pic.twitter.com/3vPF7TNBmz
— BIG TV Cinema (@BigtvCinema) February 5, 2025