BigTV English

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన ఎన్‌టీఆర్

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన ఎన్‌టీఆర్

RRR Movie: గత కొన్నేళ్లుగా ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్ రావడం కామన్‌గా మారిపోయింది. సగం కథను ఒక భాగంలో చెప్పి మగతా కథను సీక్వెల్‌లో చూసుకోమంటున్నారు మేకర్స్. అసలైతే ఈ సీక్వెల్ ట్రెండ్‌ను ప్రారంభించిందే తెలుగు దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’లో సగం కథను ఫస్ట్ పార్ట్‌లో సెకండ్ పార్ట్‌లో మిగతా కథను పూర్తిచేశారు. ఆ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో ఇదే సక్సెస్ ఫార్ములాను ఎంతోమంది దర్శకులు ఫాలో అవుతున్నారు. అయితే రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సీక్వెల్ ఉంటుందా అనే విషయంపై ఎన్‌టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చాడు.


సీక్వెల్ ఉంటుందా.?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ మూడేళ్ల కష్టపడ్డారు. అన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే రాజమౌళి.. చిన్న తప్పు జరిగినా షూటింగ్ మళ్లీ మొదటినుండి మొదలుపెట్టడానికి కూడా ఆలోచించడని తనతో పనిచేసిన చాలామంది నటీనటులు తెలిపారు. అయితే అసలు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఎలా జరిగింది? దానికోసం అందరూ ఏ విధంగా కష్టపడ్డారు? అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం తాజాగా ఒక డాక్యుమెంటరీ విడుదలయ్యింది. అదే ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ (RRR Behind And Beyond). ఈ డాక్యుమెంటరీలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ప్రస్తావన రాగా దానిపై ఎన్‌టీఆర్ మాట్లాడాడు.


Also Read: అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.. అమీర్ ఖాన్ ఓపెన్ కామెంట్స్

జరిగితే బాగుంటుంది

రాజమౌళి ఇతర సినిమాలలాగానే ‘ఆర్ఆర్ఆర్’కు కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాదే కథను అందించారు. అయితే తనకు, రాజమౌళికి మధ్య ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ఎన్నో చర్చలు జరిగాయని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టారు విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad). ఇక తాజాగా విడుదలయిన ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’లో కూడా దీని గురించి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌కు ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ ఉందని తెలిపారు. దీంతో మరోసారి ఈ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్‌టీఆర్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పటికైనా జరుగుతుందేమో అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఇది ప్రేక్షకులను మరింత హ్యాపీ చేస్తోంది.

ఇప్పట్లో కష్టమే

ప్రస్తుతం రాజమౌళి (Rajamouli), ఎన్‌టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan).. ఎవరి కమిట్మెంట్స్‌లో వారు బిజీగా ఉన్నారు. రాజమౌళి.. మహేశ్ బాబుతో మూవీని ఓకే చేశారు. ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. జనవరి నుండి ఈ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లనుందని వార్తలు మొదలయ్యాయి. కానీ ఈ మూవీ విడుదల కావాలంటే కనీసం మూడేళ్లు అయినా ఎదురుచూడాల్సిందే అని తెలుగు ప్రేక్షకులకు క్లారిటీ ఉంది. ఇక ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ కూడా ‘బాహుబలి’లాగానే రెండు భాగాల్లో తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట రాజమౌళి. అలా అయితే ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోవాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×