Vijay Deverakonda : తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీ గా వస్తున్న సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ శనివారం హైదరాబాదులో జేఆర్ సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ తన అభిమానులను, సూర్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. విజయ్ తన సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఏ సినిమాల గురించి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
నా రెండు సినిమాలు రిలీజ్ కి ముందే లీక్..
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ కథగా మన ముందుకు రానుంది. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ సూర్య సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఆయన గజినీ సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. సూర్య తెలుగులో తీసిన ప్రతి సినిమాని నేను చూశానని ఆయన సినిమాలో పాటలు కూడా నాకు ఎంతో నచ్చుతాయని చిన్నతనంలో ఆయన సినిమాల కోసం థియేటర్ దగ్గరికి వెళ్లి క్యూలో నిలబడి మరీ, టికెట్ తీసుకొని చూశానని విజయ్ తన అనుభవాలను పంచుకున్నాడు.ఇంకా విజయ్ మాట్లాడుతూ నేను సూర్య అన్న సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను. నా సినిమా గీత గోవిందం, టాక్సీవాలా, రెండు సినిమాలు లీకులు బయటికి వచ్చాయి. ఆ టైంలో మొదటిసారి సూర్య అన్న ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరు ఇప్పటికీ నాకు గుర్తుంది. నాకోసం సూర్య అన్న ప్రభాస్ అన్న ఇద్దరు ట్వీట్ చేయడం వారు సపోర్ట్ చేయడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తమిళ్ సూపర్ స్టార్ అయ్యుండి నేను అప్పుడే సినిమాలు తీస్తున్న హీరోని అలాంటిది నా సినిమాలు లీకులు బయటికి వచ్చాయని తెలుసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు సపోర్ట్ చేయడం, ఇలాంటివి తప్పు అని చెప్పడం, నాకు ఎంతో గర్వంగా అనిపించింది అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా ఇప్పటికీ విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ చెప్పడం అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయన ఆలోచన గ్రేట్ ..
విజయ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరికి చదువు ఎంతో ముఖ్యమని సూర్య అన్న తన ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించడం చాలా గ్రేట్ అని, నేను ఇలానే చేయాలని అనుకుంటున్నాను, త్వరలోనే ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫౌండేషన్ ని స్థాపిస్తాను అని,ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన నా ఫ్యాన్స్ కి, సూర్య అన్న ఫాన్స్ కి పెద్ద థ్యాంక్స్ అంటూ విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.