Shashank Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} లో తలుక్కున మెరిసిన స్టార్ లలో శశాంక్ సింగ్ ఒకరు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగి.. మెరుపు ఇన్నింగ్స్ లతో ఎన్నో మ్యాచ్ లు గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2024 లో ఆడిన శశాంక్ సింగ్.. తన పేరును అందరికీ గుర్తుండి పోయేలా చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 కి ముందు నిర్వహించిన మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.
Also Read: Shashank Singh: శ్రేయస్ తన సెంచరీని కావాలనే వదులుకున్నాడు
పంజాబ్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ప్లేయర్లలో శశాంక్ {Shashank Singh} ఒకరంటే అతని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతడిని పంజాబ్ 5.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో 11 పరుగుల తేడాతో గుజరాత్ పై గెలుపొందింది పంజాబ్.
ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ సూపర్ బ్యాటింగ్ తో చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో 44 పరుగులు చేశాడు. అతడు చేసిన పరుగులు పంజాబ్ జట్టుకి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే గుజరాత్ కూడా పంజాబ్ టార్గెట్ కి చాలా దగ్గరగా వచ్చింది. కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది.
పంజాబ్ బ్యాటింగ్ చివర్లో శశాంక్ సింగ్ ఈ విధ్వంసం ఆడకపోయి ఉంటే.. బహుశా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదేమో. అంత ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత శశాంక్ సింగ్ బ్యాటింగ్ చూసిన నేటిజెన్లు టీం ఇండియా టీ-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ {Surya kumar yadav} ని తలపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ లాగా లేట్ వయసులో ఎంట్రీ ఇచ్చి శశాంక్ సింగ్ దుమ్ము దులుపుతున్నాడని ప్రశంసిస్తున్నారు. అతడు మహమ్మద్ సిరాజ్ ని గల్లీ ప్లేయర్ లా ఓ ఆట ఆడుకున్నాడని పొగుడుతున్నారు.
Also Read: Olympics 2032: నేలమట్టం కానున్న గబ్బా స్టేడియం… కారణం ఇదే
2024లో శశాంక్ సింగ్ పంజాబ్ జట్టులోకి చాలా నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడు. అతడిని ఎంపిక చేసే సమయంలో వేలంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట ఆ జట్టు అతడిని వద్దనుకుంది. కానీ శశాంక్ సింగ్ పేరు వేలంలోకి రాగానే కనీస ధర 20 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది పంజాబ్. ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్ ఇతడు కాదని.. మరొకరని తెలిపింది. దీంతో వేలంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. కానీ వేలాన్ని ముగించడంతో పంజాబ్ అంగీకరించక తప్పలేదు. ఆ తరువాత జట్టులోకి వచ్చిన శశాంక్ సింగ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు.