Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది వరుస సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడమూయుర్చి సినిమా మొదటి నుంచి సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలుపుతూ వచ్చారు. ఆ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా పొంగల్ రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో పాటు అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్. విశాల్ కు మార్క్ ఆంటోనీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇప్పటివరకు మేకర్స్ ఈ చిత్రంలోని హీరోయిన్స్ ను అధికారికంగాప్రకటించలేదు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ను అందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 10 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
“మామీ…వేరే లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తేదీ లాక్ చేయబడింది.. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న బిగ్ స్క్రీన్‌లలోకి వస్తోంది” అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో అజిత్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సోఫాలో సూట్ వేసుకొని చేతిలో గన్ పట్టుకొని, గాగుల్స్ పెట్టుకొని ఒక డాన్ లా కనిపించాడు. బేసిక్ గా తెలుగులో అజిత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న మాట వాస్తవమే. కానీ, అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
Allu Arjun: సీక్రెట్ గా శ్రీతేజ్ ను కలవనున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా.. ?
గత కొన్నేళ్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మంచి విజయాన్ని అందుకున్నది లేదు. సినిమాలు అయితే ఆ బ్యానర్ నుంచి వస్తున్నాయి కానీ, హిట్స్ మాత్రం దక్కడం లేదు. అయినా కూడా వరుస సినిమాలతో ఈ బ్యానర్ కళకళలాడుతోంది. ఇక రాజాసాబ్ సినిమాపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
ఇప్పటివరకు డార్లింగ్ హర్రర్ నేపథ్యంలో వచ్చే కథల్లో నటించింది లేదు. మొదటిసారి హర్రర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. దీంతో పాటు ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా అంటే పెద్ద పెద్ద స్టార్లే వెనక్కి తగ్గుతారు. కానీ, అజిత్ ప్రభాస్ తోనే పోటీకి దిగుతున్నాడు. మరి ప్రభాస్ తో పోటీపడి అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Maamey…date locked for VERA LEVEL ENTERTAINMENT 💥💥💥#GoodBadUgly is coming to the BIG SCREENS on 10th April, 2025 ❤🔥
#AjithKumar @MythriOfficial @Adhikravi @suneeltollywood @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl @SureshChandraa @supremesundar… pic.twitter.com/b9ozq5Ki9x— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2025