ఈ రోజుల్లో క్రియేటివ్ గా ఆలోచించే వారిదే కాలం. మన ఆలోచనలు, పనులు ఎంత యూనిక్ గా ఉంటే, అంత గుర్తింపు ఉంటుంది. మన పని తీరే మన టాలెంట్ కు గీటు రాయిగా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. తన డ్రోన్ కెమెరాతో అద్భుతమైన వీడియో క్యాప్చర్ చేశాడు. రన్నింగ్ ట్రైన్ కిందికి డ్రోన్ తీసుకెళ్లి మరీ స్టన్నింగ్ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
క్రియేటివ్ గా రన్నింగ్ ట్రైన్ విజువల్స్ చిత్రీకరణ
సాధారణంగా రన్నింగ్ ట్రైన్ ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు ఫోటోగ్రాఫర్. వారందరితో పోల్చితే కాస్త వెరైటీగా ట్రైన్ విజువల్స్ షూట్ చేయాలనుకున్నాడు డ్రోనోగ్రఫీ.ఇన్ వెబ్ సైట్ యువకుడు. అనుకున్నట్లుగానే స్టేషన్ నుంచి బయల్దేరిన రైలు విజువల్స్ ను క్యాప్చర్ చేశాడు. ఈ విజువల్స్ లో ట్రైన్ పక్క నుంచి ప్రయాణిస్తుంది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత నెమ్మదిగా డ్రోన్ ను రైలు కిందికి తీసుకెళ్లాడు. రన్నింగ్ ట్రైన్ విజువల్స్ ను ట్రాక్ తో సహా క్యాప్చర్ చేశాడు. కాసేపటి తర్వాత ఆ డ్రోన్ ను రైలు పక్కకు తీసుకొచ్చాడు. మొత్తం నాలుగు వైపులా రైలు రైలు రన్నింగ్ విజువల్స్ ను చిత్రీకరించాడు. వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. రన్నింగ్ ట్రైన్ విజువల్స్ ను నాలుగు వైపుల క్యాప్చర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
Read Also: గంటకు 1000 కి.మీ వేగం, ఈ రైలు ముందు జెట్ విమానం కూడా దండగే!
ఫిదా అవుతున్న నెటిజన్లు
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్ సాధించింది. సుమారు 35 వేల లైక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డ్రోనోగ్రఫీ పేరుతో ఈయన సోషల్ మీడియాలో బోలెడు వీడియోలు షేర్ చేశాడు. డ్రోన్ ద్వారా తీసిన వీడియోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సముద్రపు అలల అందాలు, నగరాల్లోని ఇళ్ల విజువల్స్, ప్రకృతి అందాలు, ఒకటేమిటీ ప్రతీ సంఘటనను అద్భుతంగా షూట్ చేశాడు. ఇక రకరకాల డ్రోన్స్ తో ప్రయోగాలు చేసే వీడియోలు కూడా ఇందులో దర్శనం ఇస్తున్నాయి. ఆయన షేర్ చేసిన ప్రతి వీడియో లక్షల కొద్ది వ్యూస్, వేలకొద్ది లైకులు, కామెంట్లు అందుకుంటున్నాయి. ఆయన సోషల్ మీడియా పేజి, ఒక్కసారి చూస్తే, అన్ని వీడియోలను చూడకుండా వదిలేయరంటే ఆయన ఫోట్రోగ్రఫీ స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ డ్రోన్ ద్వారా విజువల్స్ క్యాప్చర్ చేయాలనుకునే వారు.. ఆయన విజువల్స్ ను చూస్తే, క్రియేటివ్ గా ఎలా రూపొందించవచ్చో తెలుస్తోంది. వీలుంటే మీరు కూడా ఓసారి ఆయన ఇన్ స్టా వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి.
Read Also: ఇక ఆలస్యమే ఉండదు.. విజయవాడకు బైపాస్ లైన్, ఎన్ని ప్రయోజనాలో తెలుసా?