BigTV English
Advertisement

Viswambhara : భారీ ధరకు ‘ విశ్వంభర’ హిందీ రైట్స్.. ఎన్ని కోట్లు..?

Viswambhara : భారీ ధరకు ‘ విశ్వంభర’  హిందీ రైట్స్.. ఎన్ని కోట్లు..?

Viswambhara : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) గతంలో ‘భోళా శంకర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం విశ్వంభర మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ ( Vasista) దర్శకత్వంలో తెరకేక్కుతుంది. సంక్రాంతికి రిలీజ్ అవాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మే నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ హిందీ రైట్స్ భారీ ధరకు కొనుగోలు అయ్యినట్లు ఓ వార్త వినిపిస్తుంది. మరి ఎన్ని కోట్లు విశ్వంభర హిందీ రైట్స్ కొనుగోలు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..


మెగా హీరో చిరంజీవి, బింబిసారా ఫేమ్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ విశ్వంభర’.. అయితే ఈ సినిమాకి హిందీ డబ్బింగ్‌ రైట్స్ రూపంలో భారీ బిజినెస్ జరిగింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విశ్వంభర సినిమాను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో అంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. నిజానికి చిరుకు సౌత్ లోనే కాదు.. నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ భావిస్తుంది. ఆయన సోషియో ఫాంటసీ సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మినిమం కంటెంట్‌ ఉంటుంది.. బింబిసార సినిమాతో వశిష్ట కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. అందుకే ఈ సినిమా సైతం ఆయన అన్ని వర్గాల వారిని అలరించే విధంగా రూపొందిస్తాడనే టాక్ వినిపిస్తుంది..

Read Also :రవితేజ, రాజా రవీంద్ర మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?


ఈ మూవీ రిలీజ్ పై గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్ కాస్త పెండింగ్ ఉండటంతో ఈ మూవీ మే కు షిఫ్ట్ అయ్యింది.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో రాజీ పడటం లేదు. అందుకే సినిమా విడుదల వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ టీం ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్‌ఎక్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాకు గాను వర్క్‌ చేస్తున్నారని టాక్.. వీఎఫ్‌ఎక్స్ కే భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగా మే నెలలోనూ సినిమా విడుదల అయ్యేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు విశ్వంభర సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందరి నోట్లో మే నెల అనే మాటే వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైన తర్వాత అంచనాలు పెరిగాయి. ఈ మూవీ హిట్ పైనే చిరు కెరీర్ డిపెండ్ అయ్యింది. చూడాలి మరి ఏ మాత్రం మెప్పిస్తుందో..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×