Wiaan Mulder Injured: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) పాకిస్తాన్ ( Pakisthan ) వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో టీమిండియా మ్యాచ్లు జరుగుతుండగా మిగతా మ్యాచ్ లన్ని… పాకిస్తాన్ లోనే నిర్వహిస్తున్నారు. అయితే… పాకిస్తాన్ కంట్రీలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగడంపై మరోసారి ట్రోలింగ్ జరుగుతుంది. క్రికెట్ స్టేడియాలలో సరైన.. క్వాలిటీ లేదని… దానివల్ల ప్లేయర్ లందరూ గాయపడుతున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు మీకు గ్రౌండ్లో తయారు చేయవచ్చా ? ప్లేయర్లకు రక్తాలు వచ్చేలా మైదానాలు తయారు చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. అయితే దీని అంతటికి కారణం… శుక్రవారం రోజున చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( Afghanistan vs South Africa ) మధ్య జరిగిన మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు… వియాన్ ముల్డర్ ( Wiaan Mulder ) తీవ్రంగా గాయపడ్డాడు.
ఫోర్ గేట్ వద్ద… బంతిని ఆపే క్రమంలో…. డైనింగ్ చేశాడు ముల్డర్. అయితే ఈ నేపథ్యంలోనే… అతని మోచేతికి… తీవ్ర గాయం అయింది. దీంతో వెంటనే బ్లీడింగ్ కూడా జరిగింది. ఎవరో కత్తితో అటాక్ చేసినట్లుగానే… దక్షిణాఫ్రికా ఆటగాడు ముల్డర్ చేతికి బ్లీడింగ్ రావడం… అందరూ చూశారు. అయినప్పటికీ బంతిని… అందుకున్న వియాన్ ముల్డర్ ( Wiaan Mulder Injure)… బౌండరీని ఆపాడు. అయితే… నిన్నటి మ్యాచ్ పాకిస్తాన్ లోని కరాచీ నేషనల్ స్టేడియంలో ( Karachi National Stadium ) జరిగింది. ఇదే గ్రౌండ్ లో ఇప్పటికే చాలామంది ప్లేయర్లకు గాయాలు అయ్యాయి. దీంతో కరాచీ నేషనల్ స్టేడియంలో మెయింటెనెన్స్ సరిగా లేదని… అసలు పాకిస్తాన్ వాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహించడం చేత కావడం లేదంటూ… సెటైర్లు పేల్చుతున్నారు.
వెంటనే అక్కడి నుంచి చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటును షిఫ్ట్ చేసి దుబాయిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. లేకపోతే పాకిస్తాన్లోనే అన్ని మ్యాచ్లు నిర్వహిస్తే… ప్లేయర్లు ఇలాగే గాయాలపాలు అవుతారని అంటున్నారు. మైదానంలో… ఇనుప వస్తువులు కూడా క్లీన్ చేయడం లేదని… అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( Afghanistan vs South Africa ) మధ్య జరిగిన మ్యాచ్ లో సఫారీలు గెలిచారు. ఏకంగా 107 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది దక్షిణాఫ్రికా. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగనుంది.
Also Read: Pakistan – Champions Trophy: టీమిండియా దెబ్బ అదుర్స్.. ఇక ఇంటికే పాక్.. లెక్కలు ఇవే !
Mulder injury😳#AFGvSA #ChampionsTrophy2025 pic.twitter.com/9j5T8KWk3b
— Urooj Jawed🇵🇰 (@uroojjawed12) February 21, 2025
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">