BigTV English

North Korea – Suicide Drones : ఇక డ్రోన్లతో చంపేస్తాడట.. కిమ్ జాంగ్ ఉన్ మరో అరాచకం, భారీ స్థాయిలో సన్నహాలు

North Korea – Suicide Drones : ఇక డ్రోన్లతో చంపేస్తాడట.. కిమ్ జాంగ్ ఉన్ మరో అరాచకం, భారీ స్థాయిలో సన్నహాలు

 


North Korea – Suicide Drones : నిత్యం యుద్ధ సన్నాహాల్లో ఉంటూ.. మిగతా దేశాలకు సవాళ్లు విసురుతుండే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు తన దృష్టిని ఆత్మహుతి డ్రోన్ల ఉత్పత్తిపై పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత చౌకగా ఉత్పత్తి చేస్తూ, ప్రభావవంతంగా దాడులు చేయగల ఈ డ్రోన్లు.. తమకు బాగా ఉపయోగపడతాయని కిమ్ భావిస్తున్నారు. అందుకే.. తక్షణమే దేశంలో ఆత్మహుతి డ్రోన్ల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.

రెండు రోజుల క్రితం డ్రోన్ల ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కిమ్ నేరుగా పరిశీలించారు. భూతలం, సముద్రంలో నిర్దేశించిన టార్గెట్ పైకి ప్రయోగించిన డ్రోన్లు సమర్థవంతంగా లక్ష్యాల్ని ఛేదించాయి. ఆ వెంటనే డ్రోన్ల తయారీపై కొరియా సైన్యం దృష్టి పెట్టాలంటూ కిమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్లు తప్పనిసరి ఆయుధాలుగా అభివర్ణించిన కిమ్.. ఉత్తర కొరియాకు కావాల్సిన డ్రోన్లను స్వతాహాగానే తయారు చేసుకోవాలని నిర్దేశించారు.


ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా డోన్ల పనితీరును పరిశీలిస్తున్న కిమ్.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో, ఇజ్రాయిల్ పై దాడుల్లోనూ డ్రోన్లు ప్రభావవంతంగా పనిచేస్తుండటాన్ని  పరిగణలోకి తీసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంఘర్షణలలో.. ఖరీదైన, ప్రాణాంతకమైన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను బదులు ఆత్మహుతి డ్రోన్లను ప్రయోగించారు. అవి  తీవ్రంగా ప్రత్యర్థుల్ని నష్టపరిచిన విధానం సైతం కిమ్ ఆలోచనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఉత్తర కొరియా నియంత గతంలోనూ ఓ సారి ఆత్మహత్య డ్రోన్‌ల పనితీరుపై ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల్ని చూసిన తర్వాతే ప్యోంగ్యాంగ్ సైన్యం సాధ్యమైనంత త్వరగా ఆత్మహుతి డ్రోన్లను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. గతంలో ఓసారి ఉత్తర కొరియా డ్రోన్‌లను సియోల్ వంటి వ్యూహాత్మక ప్రదేశాలలో పాటు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం చుట్టూ ఉన్న నో-ఫ్లై జోన్‌లో గంటల తరబడి ఉత్తర కొరియా డ్రోన్లను ఎగురవేసింది. వాటిని కూల్చేందుకు నానా పాట్లు పడ్డ దక్షిణ కొరియా సైన్యం.. తర్వాతి కాలంలో డ్రోన్స్ ఆపరేషన్ కమాండ్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.

ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా సాయుధ దళాలకు సాయంగా ఉత్తర కొరియా ఇటీవల తన సైన్యాన్ని మోహరించింది. ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉండగా, క్రమంగా మరింత బలపడుతోంది. వీరిద్దరి మధ్య పెరుగుతున్న సైనిక భాగస్వామ్యం నేపథ్యంలో ఉత్తర కొరియా నిర్వహించిన ఆత్మాహుతి డ్రోన్ పరీక్షలకు రష్యా సాంకేతిక సాయం అందించినట్టుగా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా, ఉత్తర కొరియాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఉత్తర కొరియా, రష్యాలపై దాడి జరిగినప్పుడు పరస్పర సైనిక సహాయానికి రెండు దేశాలకు కట్టుబడి ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Also Read : పుతిన్ బాటలో ట్రంప్.. మూడోసారి గద్దెనెక్కడం సాధ్యమేనా? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో రష్యాకు అంతర్జాతీయంగా మరే దేశం సైనిక సాయం కానీ, డ్రోన్ల సాంకేతికతను కానీ అందించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఉత్తర కొరియా సైతం.. అలానే అనేక దేశాల నుంచి ఆంక్షల్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తామే స్వయంగా.. కావాల్సిన డ్రోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×