BigTV English

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టారని ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడంపై భక్తులు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. దీనిపై అన్నిరకాల వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దేశంలోని హిందూ సంఘాలతోపాటు కేంద్రం కూడా దృష్టి సారించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సర్కార్‌ని కోరింది కేంద్రప్రభుత్వం. లడ్డూ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రియాక్ట్ అయ్యారు.

ప్రసాదంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించాయని అన్నారు. ఆలయంలో లడ్డూ కల్తీ అయ్యిందన్న విషయం ప్రతీ భక్తుడినీ భావిస్తోందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడాలన్నారు.


తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు తీవ్రమయ్యాయి. తిరుమల లడ్డూకు నందినీ నెయ్యిని వినియోగించడంతో కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ అలర్ట్ అయ్యింది. కర్ణాటకలోని దేవాలయ శాఖ నోటిఫై చేసిన ఆలయాల్లో ఇకపై తయారు చేసే ప్రసాదాలకు కేవలం నందిని నెయ్యి మాత్రమే వినియోగించాలంటూ నిర్ణయం తీసుకుంది.

ALSO READ: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

ఈ మేరకు ఆ రాష్ట్రమంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు కర్ణాటక దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లో ప్రసాదాల తయారీలో క్వాలిటీ పాటించాలని అందులో ప్రస్తావించింది. ప్రసాదాలతోపాటు దీపాలు, ఇతర సేవలకు నందినీ నెయ్యిని వాడాలని వాడటాన్ని తప్పనిసరి చేసింది.

తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి కల్తీ వ్యవహారం అటు తమిళనాడు సైతం కుదిపేసింది. అక్కడి భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీడీడీ బయటపెట్టిన సమాచారంతో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీపై ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ అధికారులు దాడులు చేశారు.

నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలు పరిశీలించారు. మరోవైపు తమ కంపెనీ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఆ సంస్థ వెల్లడించింది. జూన్, జూలై లో నెయ్యిని తాము సరఫరా చేశామని, ఎలాంటి టెస్టులైనా చేసుకోవచ్చని వెల్లడించింది.

మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. పంది, ఆవు కొవ్వు కలిసిందని పరీక్షల్లో తేలిందన్నారు. ఏఆర్ డెయిరీ ఫుడ్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. టీటీడీకి సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నవారిలో వైష్ణవి డెయిరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్, కిర్పారామ్ డెయిరీ ప్రైవేటు లిమిటెడ్, ప్రీబియర్ అగ్రి ఫుడ్స్ లు వున్నాయి. వీటిలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌లో కల్తీ ఉన్నట్లు తేలిందని తెలిపారు.

 

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×