కేరళలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు చిక్కుకున్నారు. శబరిమల యాత్రకు వెళ్లిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామానికి చెందిన భక్తకు కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే తమకు అక్కడి పోలీసులు సహకరించడం లేదని, వాహనం రోడ్డు ప్రమాదంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎలాగైనా తమకు సాయం చేయాలని భక్తులు కోరారు.
Also read: అధ్యక్ష పీఠం నాదే.. తెలంగాణ బీజేపీలో ఫైట్.. రేసులో ఆ నలుగురు
ఇదిలా ఉంటే మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున కేరళకు వెళుతున్న సంగతి తెలిసిందే. శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా జరిగిన ఘటనతో ఏపీ భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.