SRH VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు… వరుణుడు విలన్ గా మారాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పూర్తయిన తర్వాత… ఉప్పల్ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ బ్యాటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ భారీ వర్షం కురిస్తే.. మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !
ఇలాంటి నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తగ్గిపోవాలని… హైదరాబాద్ బ్యాటింగ్ చేయాలని కోరుతున్నారు. కానీ మరో మూడు రోజుల పాటు హైదరాబాదులో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం పూట నుంచే వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వద్ద కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో స్టేడియం మొత్తం కవర్లతో కప్పేశారు. మరి మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.
మ్యాచ్ రద్దు అయితే హైదరాబాద్ ఇంటికేనా ?
ఉప్పల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే… హైదరాబాద్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఇదే జరిగితే మొత్తంగా హైదరాబాద్ జట్టు ఖాతాలో ఏడు పాయింట్లు చేరుతాయి. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మొత్తంగా 13 పాయింట్లు వస్తాయి. అప్పుడు… ప్లే ఆఫ్ రేసు నుంచి హైదరాబాద్ తప్పుకునే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై తో పాటు మరో మూడు మ్యాచ్ లలో కచ్చితంగా హైదరాబాద్ గెలవాలి. అప్పుడే 14 పాయింట్లు వస్తాయి. ఇక ఉప్పల్ మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ రావడం జరుగుతుంది. మిగిలిన మరో మూడు మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలిచిన 13 పాయింట్లు మాత్రమే వస్తాయి. అప్పుడు హైదరాబాద్ రన్ రేట్ చాలా తక్కువగానే ఉంటుంది. అదృష్టం తగిలితే, తప్ప ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్సే ఉండదు. కాబట్టి… ఇవాల్టి మ్యాచ్ రద్దు కాకుండా… హైదరాబాద్ గెలిస్తేనే ఛాన్సులు ఎక్కువ.
కావ్య మారన్ పూజలు
ఉప్పల్ మ్యాచ్ నేపథ్యంలో వర్షం పడకూడదని… హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్… స్టేడియంలోనే పూజలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను బిగ్ బాస్ బ్యూటీ లహరి తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆకాశం వైపు చూస్తూ వర్షం పడొద్దు దేవుడా..? అంటూ కావ్య పాప వేడుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Miss World Contestants: ఐపీఎల్ మ్యాచ్ లకు మిస్ వరల్డ్ పోటీదారులు.. ఉప్పల్ లో ఫ్యాన్స్ కు పండగే
🌧️ Heavy rain continues in Hyderabad!
Looks like rain might just save DC today 😶🌫️
Heartbreak for SRH 💔 — dominating the match, but nature has other plans…Bad luck, SRH. Cricket can be cruel. 😞#SRHvsDC #DCvsSRH https://t.co/aHcx140E3n pic.twitter.com/lJoHLVD3zU
— IPL Mantra (@IPL_Mantra) May 5, 2025
?igsh=cGJjZHV6cDBuYXYz