BigTV English

BCCI Rules: ఐపీయల్ 2025కు విరాట్ – రోహిత్ దూరం?

BCCI Rules: ఐపీయల్ 2025కు విరాట్ – రోహిత్ దూరం?

BCCI Rules: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్ ఏటికేడు మరింత పెరుగుతూ పోతుంది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్.. ఇప్పటికీ 17 ఏళ్లు పూర్తి చేసుకున్నా దీని ఆదరణ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. క్రికెట్ లోనే అతిపెద్ద లీగ్ గా ఐపిఎల్ హవా నడిపిస్తుంది. ఇక భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి పాపులర్ ఆటగాళ్లు లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ఊహించగలమా..? అంటే కష్టం అని చెప్పాలి.


Also Read: Karun Nair: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి కరుణ్ నాయర్ ?

అభిమానులు అసలు ఈ ఆలోచన కూడా చేయలేరు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇది జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఇందుకు కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకువచ్చిన పది నిబంధనలతో కూడిన కొత్త పాలసీ. ఈ 10 నిబంధనలతో కూడిన పాలసీని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారే కాకుండా ఎవ్వరూ వీటిని ఫాలో కాకపోయినా ఐపిఎల్ లో ఆడకుండా బ్యాన్ విధిస్తామని హెచ్చరించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.


ఇటీవలి కాలంలో భారత జట్టులోని బ్యాటర్లు పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో క్రమశిక్షణ, సభ్యుల మధ్య ఐక్యత, సానుకూల వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం భారత హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్, టీమ్ కెప్టెన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం బీసీసీఐ వీటిని ఖరారు చేసింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోవడంతో వీరు అందరికీ టార్గెట్ గా మారారు. వీరు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే చర్చ కూడా మొదలైంది. దీంతో వీరిని దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ ఈ నిబంధనలను తీసుకువచ్చిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే.. టీమ్ లో ఎంపిక కావాలంటే దేశవాళి మ్యాచ్ లలో తప్పనిసరిగా ఆడాలి.

మ్యాచ్ ల సందర్భంగా పర్యటనకు వెళ్లినప్పుడు ఆటగాళ్లు విడివిడిగా కాకుండా జట్టుతోనే కలిసి ప్రయాణించాలి. ఒకవేళ ఏ ఆటగాడు అయినా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలంటే అందుకు ముందస్తుగా కోచ్ లేదా సెలెక్షన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. లగేజ్ విషయంలోనూ ప్లేయర్లు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ పరిమితికి మించి లగేజ్ తీసుకువస్తే అందుకు అయ్యే ఖర్చులను వారే భరించాలి. ఏదైనా సిరీస్ సందర్భంగా టూర్ వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత సిబ్బంది.. అనగా మేనేజర్లు, అసిస్టెంట్స్, చెఫ్స్, సెక్యూరిటీ సిబ్బందిని తీసుకురావడం పై నిషేధం విధించింది.

ఒకవేళ అలా తీసుకు వెళ్లాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. అలాగే బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ లో ఏవైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలంటే వాటి ఖర్చుని ఆటగాళ్లే భరించాలి. ఇక ప్రాక్టీస్ సెషన్స్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. షెడ్యూల్ ప్రాక్టీస్ ముగిసే వరకు ప్లేయర్లు అందరూ అక్కడే ఉండాలి. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే హోటల్ కి వెళ్లడానికి వీలు లేదు. అందరూ ఒకేసారి కలిసి ప్రయాణించాలి. ఏదైనా సిరీస్ లోని పర్యటన సందర్భంగా ఆటగాళ్లు వ్యక్తిగత షూట్ లలో పాల్గొనకూడదు.

Also Read: Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంజెక్షన్లు తీసుకుంటున్న కోహ్లీ !

విదేశాలలో నెల కంటే ఎక్కువ రోజులు పర్యటించాల్సి వస్తే ఆటగాళ్ల కుటుంబ సభ్యులు రెండు వారాలపాటు వారితో కలిసి ఉండేందుకు మాత్రమే అనుమతి. భార్యా, పిల్లలు కాకుండా ఇతరులు వస్తే వారి ఖర్చును ఆటగాళ్లే భరించాలి. ఇక బిసిసిఐ నిర్వహించే అధికారిక షూటింగ్ లకు ప్లేయర్లందరూ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆటగాళ్లను ఐపిఎల్ లో ఆడకుండా బ్యాన్ చేస్తామని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. అయితే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే.ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి వారిని టార్గెట్ చేసుకొని బీసీసీఐ ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×