Lady Aghori: అఘోరా వర్సెస్ లేడీ అఘోరీ మధ్య సమరం సాగుతోంది. అదేనండీ తణుకుకు చెందిన అఘోరా రాజేష్ నాథ్, తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ మధ్య వాగ్వివాదం సోమవారం రచ్చగా మారింది. తనతో అసభ్యకరంగా అఘోరా రాజేష్ నాథ్ చాటింగ్ చేస్తున్నారని, ఓ యువతి వీడియో రిలీజ్ చేసి ఆరోపణలు చేయడమే వీరి మధ్య వివాదానికి కారణంగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ ఒక్కసారిగా తణుకులో ప్రత్యక్షమైంది. అక్కడ నిరసనకు కూడా దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గతంలో లేడీ అఘోరీ గురించి అఘోరా రాజేష్ నాథ్ మాట్లాడుతూ.. ఆమె అసలు అఘోరీ కాదని, ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆ సమయంలోనే అఘోరీ స్పందించి, రాజేష్ నాథ్ అంతుచూస్తానంటూ హెచ్చరించారు. ఇలా వీరి మధ్య మాటల యుద్దం సాగుతూ వస్తోంది. అయితే రాజేష్ నాథ్ పై ఓ యువతి వేధిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. అలా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే, లేడీ అఘోరీ ఛలో తణుకు వంటూ వచ్చేశారు.
రాజేష్ నాథ్ పై ఆరోపణలు చేస్తున్న యువతికి వీడియో పోస్ట్ చేయమని సలహా ఇచ్చింది కూడా అఘోరీనేనని సదరు యువతి తెలపడం విశేషం. తణుకులోని రాజేష్ నాథ్ ఆశ్రమం వద్దకు వచ్చిన అఘోరీ తీవ్ర విమర్శలు చేస్తూ నిరసనకు దిగింది. పోలీసులు వచ్చి లేడీ అఘోరీని నిరసన విరమించాలని కోరినా, ఏ మాత్రం కదల్లేదు. చిట్టచివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అఘోరీ, రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి భాదితురాలు మాట్లాడుతూ.. తనతో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ వేధిస్తున్నాడని ఆరోపించింది.
దీనితో అఘోరీని ఆశ్రయిస్తే మద్దతు పలికిందని ఆమె తెలిపారు/ భక్తులను అఘోరా బాబా రాజేశ్‌నాథ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. లేడీ అఘోరీ ఆరోపిస్తోంది. రాజేశ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని, పోరాటం సాగిస్తానంటూ అఘోరీ తెలిపారు. మొత్తం మీద అఘోరా వర్సెస్ అఘోరీ వివాదం చిలికిచిలికి గాలివానగా మారిందని చెప్పవచ్చు. పోలీసులు మాత్రం అసలేం జరిగింది? ఈ ఆరోపణల్లో ఉన్న వాస్తవమెంత అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఆరోపణలపై శివరుద్ర స్వామి మాట్లాడుతూ.. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని, న్యాయాన్ని కాపాడాలని కోరారు. అసలు ఇందులో వాస్తవమెంత ఉందో తేల్చాలని ఆయన కోరారు.
Also Read: Dog Fights Tiger : వీరశునకం.. యజమానిపై పులి దాడి.. తరిమికొట్టిన కుక్క..
మొత్తం మీద యువతి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత అఘోరీ ఎంటర్ కావడం ఇదంతా ప్లాన్ గా జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం లేడీ అఘోరీ వద్ద ఆధారాలను పరిశీలించి రాజేష్ నాథ్ అఘోరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో అఘోరా వర్సెస్ అఘోరీ వివాదం సెన్సేషనల్ గా మారిందని చెప్పవచ్చు.