BigTV English
Advertisement

Viswambhara: అనిల్ మూవీకే ప్రయారిటీ.? ఇక ‘విశ్వంభర’పై విసుగు వచ్చేసిందా.?

Viswambhara: అనిల్ మూవీకే ప్రయారిటీ.? ఇక ‘విశ్వంభర’పై విసుగు వచ్చేసిందా.?

Viswambhara: ప్రస్తుతం హీరోలంతా ఒక సినిమా సెట్స్‌పైకి ఉండగానే మరొక సినిమాను ఒప్పేసుకుంటున్నారు. దీంతో అసలు ముందుగా వారు ఒప్పుకున్న సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల్లో కూడా కన్ఫ్యూజన్ మొదలవుతోంది. యంగ్ హీరోలు మాత్రమే కాదు.. సీనియర్ హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉంటుంది. తను హీరోగా నటించిన చివరి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తన పూర్తి ఫోకస్ ‘విశ్వంభర’పైనే పెట్టారు చిరు. కానీ ఇప్పుడు ‘విశ్వంభర’ను కూడా పక్కన పెట్టేసి అనిల్ రావిపూడితో చేసే సినిమాపై ఫోకస్ పెట్టారు. దీంతో అసలు ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది.


గ్రాఫిక్స్‌పై ట్రోల్స్

మెగాస్టార్ చిరంజీవి చివరిగా ‘భోళా శంకర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ చిరు కెరీర్‌లోనే అతిపెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. అందుకే ఇక రీమేక్స్‌ను పక్కన పెట్టి కేవలం ఒరిజినల్ కథలతోనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్‌తో ‘విశ్వంభర’ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. అక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఈ మూవీలో గ్రాఫిక్స్‌పై, వీఎఫ్ఎక్స్‌పై ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో మూవీ టీమ్ ఒక నిర్ణయానికి వచ్చింది.


ఎన్నోసార్లు పోస్ట్‌పోన్

‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్ ప్రస్తుతం పూర్తయ్యింది. కానీ ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్‌ను ఇంప్రూవ్ చేయడం కోసం పాత టీమ్‌ను పక్కన పెట్టి కొత్త టీమ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారని కొన్నాళ్ల క్రితం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే నిజమయితే ఈ సినిమా విడుదలకు మరికాస్త సమయం పడుతుంది. అసలైతే ఈ మూవీని 2025 సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల అది సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయినట్టుగా రూమర్స్ వినిపించాయి. ఇంతలోనే అనిల్ రావిపూడితో చేసే సినిమాపై ఫోకస్ పెట్టారు చిరంజీవి. దీంతో అసలు ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి, రిలీజ్ ఎప్పుడు లాంటి అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.

Also Read: పాన్ ఇండియా రేసులోకి మాటల మాంత్రికుడు.. స్క్రిప్ట్ లాక్డ్

రెగ్యులర్‌గా షూటింగ్

ఇప్పటికే అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో చేసే సినిమాకు డేట్స్ ఇచ్చేశారు చిరంజీవి (Chiranjeevi). ఇక ఉగాది రోజున రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి చిరు దానిని పక్కన పెట్టేసి అనిల్ సినిమాకు ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘విశ్వంభర’ 2026 సంక్రాంతి తర్వాతే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×