SCR Extends Summer Special Trains: వేసవిలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే తగిన ఏర్పాట్లు చేసింది. సమ్మర్ లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా రైల్వే సర్వీసులను నడిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. వేసవి ప్రత్యేక రైలు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
పొడిగించిన సమ్మర్ రైలు సర్వీసులు ఇవే..
ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వేఅధికారులు పలు రైలు సర్వీసులను పొడిగించారు. ముఖ్యంగా పాట్నా – చర్లపల్లి – పాట్నా మధ్య రైళ్ల ప్రయాణాన్ని పొడిగించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ఇప్పటికే పలు సమ్మర్ సర్వీసులను నడిపిస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే.. ఆ సేవలను కొనసాగించాలని యోచిస్తోంది.
⦿ చర్లపల్లి- పాట్నా మధ్య నడిచే రైలు నెం-07255 మరిన్ని రోజులు పొడిగించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ రైలు సర్వీసులను జూన్ 3 వరకు నడిపించాలని నిర్ణయించారు. తాజాగా జూన్ 4 నుంచి ఆగస్టు 1 పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు రాత్రి 11 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి ఉదయం 11:30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది.
⦿ పాట్నా- చర్లపల్లి మధ్య నడిచే రైలు నెం-03253ను కూడా పొడిగించారు. ఈ రైలును జూన్ 1 వరకు నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఈ రైలును జూన్ 2 నుంచి జూలై 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాట్నా నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
Read Also: త్వరలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్ పరుగులు… టికెట్ ధర ఎంతో తెలుసా?
⦿ చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య ప్రతి సోమవారం నడిచే రైలును ఈ నెల 12 నుంచి జూన్ 23 వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
⦿ చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రతి మంగళవారం నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 13 నుంచి జూన్ 24 వరకు నడిపిస్తున్నారు.
⦿ తిరుపతి-వికారాబాద్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు పొడిగించారు.
⦿ వికారాబాద్-తిరుపతి స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలును రైలు కూడా జూన్ 29 వరకు పొడిగించారు.
ప్రయాణీకుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో సమ్మర్ స్పెషల్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణీకులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. సమ్మర్ లో ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్, ఇక ఆ ప్రాంతాలకూ మెట్రో వచ్చేస్తోంది!