Mega 157 Movie:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం యంగ్ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ఈ ఏడాది వశిష్ట మల్లిడి (Vasistha mallidi) దర్శకత్వం లో విశ్వంభర(Vishwambhara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి కూడా అవకాశం కల్పించారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్లో ‘చిరు 157’ అనే వర్కింగ్ టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఇకపోతే నిన్న హైదరాబాదులో చాలా సైలెంట్ గానే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీనికి తోడు ఈ సినిమాలో చిరంజీవి సరసన మళ్లీ నటించడానికి లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) తన నిర్ణయాన్ని కూడా మార్చుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా కోసం ఈమె తన కెరియర్ లోనే మొదటిసారి చాలా కాంప్రమైజ్ లు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం విన్న నెటిజన్స్ సడన్గా ఈ కాంప్రమైజ్ ఏంటి? అసలు నయనతార నుండి కాంప్రమైజ్ అనే మాట వినిపించడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు
మరి అసలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చిరు 157 మూవీ కోసం దిగివచ్చిన నయనతార..
సౌత్ సినీ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో నయనతార ప్రథమ స్థానంలో ఉంటారు. ఎంత లేదనుకున్న సంవత్సరానికి రెండు నుండి మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. సినిమాలో చేయడమే కాదు సౌత్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా ఈమెకు పేరు ఉంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా నయనతార చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా రిజల్ట్ చూపలేకపోతున్నాయి. దీంతో ఈమె డిమాండ్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు నయనతారకు 40 ఏళ్లు దాటడంతో అటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కూడా దూరంగానే ఉంటున్నారు. అలాంటి ఈమె ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా ద్వారా హీరోయిన్ గా మళ్ళీ పరిచయం కాబోతోందని మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు నయనతార. పైగా ఈ సినిమా కోసం రూ.12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ మొదట్లో డిమాండ్ చేశారట. అయితే మేకర్స్ అంత మొత్తంలో పారితోషకం ఇచ్చుకోలేమని, వేరే హీరోయిన్ ను వెతకడం మొదలుపెట్టారు.
కెరియర్ లో ఫస్ట్ టైం ఆమె నుండి కాంప్రమైజ్..
కానీ చివరికి నయనతార దిగివచ్చి ఈ సినిమాను రూ.6 కోట్లకు చేస్తానని ఒప్పుకుందట. అంతేకాదు నయనతార ఈమధ్య కాలంలో ఒప్పుకున్న సినిమాలలో అతి తక్కువ రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమాకే కావడం గమనార్హం. దీంతో పాటూ ఇప్పటివరకు తన కెరీర్ లో ఏ సినిమా ప్రమోషన్స్ కి కూడా హాజరవని నయనతార, తొలిసారి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తానని కూడా మాట ఇచ్చిందట. ఇక నయనతారను ప్రమోషన్స్ కి ఒప్పించిన విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రమోషన్స్ కి ఒప్పించానని చెప్పడానికి గుర్తుగా ఆమెను సినిమాలో హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని కూడా షూట్ చేసి రిలీజ్ చేశాడు. మొత్తానికైతే నయనతార ప్రస్తుతం తనకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా తన కండిషన్స్ అన్నింటిని పక్కనపెట్టి, తన కెరియర్లో మొదటిసారి కాంప్రమైజ్ అయిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ALSO READ:Jayam Ravi – Arti: జయం రవి – ఆర్తి విడాకులు.. ప్రాణహాని ఉందంటూ సింగర్ ఎమోషనల్.!