Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ చిత్ర సినిమాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే గంగోత్రి నుంచి పుష్ప-2 వరకు ఆయన జర్నీ అంత సులభంగా ఏమీ సాగలేదు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా యాక్టింగ్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు బన్నీ. అంతేకాకుండా ఈ ఏడాది ఆయన ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ గా మారాడు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం 2024 నాటికి అల్లు అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 460 కోట్లుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో అల్లు అర్జున్ (Allu Arjun) కి ఒక అద్భుతమైన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. మినిమం ఆర్కిటెక్చర్ తో, నేచురల్ వైట్ కలర్ లో పెయింట్ చేసిన ఆ ఇంట్లో ఇండోర్ జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, పెద్ద ప్లేగ్రౌండ్ ఉన్నాయి.
అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) గ్యారేజీలో రేంజ్ రోవర్ వోగ్, హమ్మర్ H2, జాగ్వార్ XJL, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ తో పాటు తదితర కాస్ట్ లీ కార్లు ఉన్నాయి. ఇక అంతేకాకుండా 2022లో అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్యకు నివాళిగా హైదరాబాద్లో అల్లూ స్టూడియోస్ ని స్టార్ట్ చేశారు. ఈ స్టూడియో ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సినిమాలను నిర్మిస్తారు. అలాగే అల్లు ఫ్యామిలీకి గీతా ఆర్ట్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఉన్న విషయం తెలిసిందే.
ఇక 2023లో అల్లు అర్జున్ హైదరాబాదులో ‘ఏఏఏ’ అనే మల్టీప్లెక్స్ ను కూడా స్టార్ట్ చేశారు. ఈ థియేటర్ బిజినెస్ ని అల్లు అర్జున్ ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇవి మాత్రమే కాకుండా జూబ్లీహిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ అనే రెస్టారెంట్ కూడా ఉంది అల్లు అర్జున్ (Allu Arjun) కు. అంతేకాకుండా ఆయన ఆహా ఓటిటికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. హైదరాబాద్ లో ఉన్న హెల్త్ కేర్ స్టార్ట్ అప్ ‘కాల్ హెల్త్’ సర్వీసెస్ లో కూడా బన్నీ పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇవి మాత్రమేనా… ఒకవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టుగా ఫోర్బ్స్ ఇండియా రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఇవన్నీ కలిపి చూసుకుంటే అల్లు అర్జున్ 2024లో దాదాపు 460 కోట్ల విలువైన ఆస్తులకు యజమాని అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ డిసెంబర్ 5న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.