BigTV English

SDT 18: ఒకే వేదికపై ఇద్దరు మెగా హీరోలు.. ‘ఎస్‌డీటీ 18’ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ సిద్ధమా?

SDT 18: ఒకే వేదికపై ఇద్దరు మెగా హీరోలు.. ‘ఎస్‌డీటీ 18’ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ సిద్ధమా?

SDT 18: చాలాకాలంగా మెగా హీరోల నుండి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి అప్డేట్స్ ఏమీ రావడం లేదు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ నుండి అప్డేట్స్ వస్తున్నా కూడా చాలాకాలంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌లో అవి అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. అందుకే మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే అప్డేట్ ఏదైనా కావాలని ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన మెగా అప్డేట్ అందిస్తానని, ఫ్యాన్స్‌ను సిద్ధంగా ఉండమన్నారు. కానీ ఇద్దరు మెగా హీరోలను ఒక వేదికపై చూసే అప్డేట్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు.


ఏడాది గ్యాప్

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటి నుండి సాయి ధరమ్ తేజ్‌కు హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. కొన్నాళ్ల క్రితం తనకు ఘోరమైన యాక్సిడెంట్ అయినా కూడా కోలుకున్న వెంటనే తన కమిట్మెంట్స్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. అలాంటి సాయి ధరమ్ తేజ్ నుండి ఈ ఏడాది అస్సలు ఒక్క సినిమా కూడా రాలేదు. 2023లోనే బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో కనిపించిన ఈ మెగా హీరో.. ఈ ఏడాది అసలు ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. సినిమా విడుదల చేయడం గురించి పక్కన పెడితే అసలు ఒక్క మూవీ కూడా ప్రారంభించలేకపోయాడు. అందుకే ఇప్పుడు ‘ఎస్‌డీటీ 18’ కోసం భారీ ప్లాన్ వేశాడు.


Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై మరో సినిమా.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా!

ఈవెంట్ ఫిక్స్

రోహిత్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఒక మూవీ చేస్తున్నాడు. అది తన కెరీర్‌లో 18వ చిత్రం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసి దీని గురించి అధికారికంగా ప్రకటించారు. అప్పటినుండి ఈ మూవీ గురించి ఇంకేం అప్డేట్ బయటికి రాలేదు. తాజాగా రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ఎస్‌డీటీ 18 కార్నేజ్’ను విడుదల చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. యూసఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మెగా లాంచ్ జరగనుంది. ఒక భారీ ఈవెంట్ కోసం రెండు మెగా ఫోర్స్‌లు కలవనున్నాయని మేకర్స్ ప్రకటించారు.

మన చరణ్

తన సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను రామ్ చరణ్ రివీల్ చేస్తున్నాడనే సంతోషంతో సాయి ధరమ్ తేజ్ ఈ విషయంపై ట్వీట్ చేశాడు. ‘నా చరణ్, మీ చరణ్, మన చరణ్ ఎస్‌డీటీ 18 కార్నేజ్‌ను విడుదల చేయనున్నాడు’ అని ప్రకటించాడు. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే ఆసక్తిని పెంచేసింది ఎస్‌డీటీ 18. మొత్తానికి అసలు ఈ సినిమా దేని గురించి, దీని కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే డిసెంబర్ 12 వరకు వేచిచూడాల్సిందే. ఇక చాలాకాలం తర్వాత ఈ ఈవెంట్ ద్వారా ఇద్దరు మెగా హీరోలను ఒకే వేదికపై చూడడం కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×