Saree Movie : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలను తీస్తూనే మరోవైపు వివాదాలకు కేరాఫ్ గా మారుతుంటాడు. అయితే ఈయన ఇటీవల కాలంలో తీసిన సినిమాలకు జనాల నుంచి, అటు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం రావడంతో ఆగిపోయాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శారీ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. ‘శారీ’ లాగ్ లైన్: ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులను మూవీ బాగా ఆకట్టుకుంది. సినిమా గురించి పక్కన పెడితే..ఈ సినిమా హీరోయిన్ ఆరాధ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. అయితే ఆమె రామ్ గోపాల్ వర్మ గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో వర్మ అసలు స్వరూపం ఇదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ హీరోయిన్ వర్మ గురించి ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…
ఆరాధ్య ఇంటర్వ్యూ లో ఏం చెప్పింది..?
హీరోయిన్ ఆరాధ్య మాట్లాడుతూ.. సినిమా గురించి ఎలా రియాక్ట్ అయిందో అన్న విషయాలని పంచుకుంది.. నిజానికి ఈ భామ మలయాళీ నుంచి వచ్చింది. మొదట ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అలాగే ఫోటోషూట్లు చేస్తూ పాపులర్ అయిందని చెప్పింది. ఆమెకు శారీ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయాన్ని పంచుకుంది. ఈమె చేసిన రీల్స్ వీడియోలను చూసిన డైరెక్టర్ వర్మ నేరుగా ఆమెకు మెసేజ్ చేశారని చెప్పింది.. ఇంస్టాగ్రామ్ వీడియోలను లైక్ చేశారు. ఇక అప్పుడే మెసేజ్ చేసి తన నంబర్ కూడా ఇచ్చాడు. మొదట్లో ఆయన మెసేజ్ లకు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత డైరెక్ట్ గా కాల్ చేశారు. ఆ సమయంలో ఎవరు ఆర్జీవి అని గూగుల్ లో వెతికాను. ఆయన రంగీలా సినిమా డైరెక్టర్ అని చూసి షాక్ అయ్యాను. అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని మొదట షాక్ అయ్యాను కొన్నిసార్లు ఆయన ఫోన్ ని లిఫ్ట్ చేయకపోయేదాన్ని మా అమ్మకి చెప్తే ఇలాంటివి అవసరమా చదువుకోకుండా అనేసి నన్నే తిట్టింది అని ఆరాధ్య అంది.. ఆ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు ఆయన నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు.. ఇక ఈయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో అనుకుంటారని ఫోన్ లిఫ్ట్ చేశాను దాదాపు 6 నెలల పాటు ఆయన నన్ను వదల లేదని చెప్పేసింది. ఇక సినిమా చేస్తే మంచిదని నాకు కూడా అనిపించింది ఆ తర్వాత ఆయనకు ఓకే చెప్పాను. అలా రామ్ కోసమే సినిమాకు ఒప్పుకున్నాను అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పింది.
Also Read : ‘లైలా ‘ మూవీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వర్మ వల్లే ఆ అవకాశం వచ్చింది..?
ఒక్కసారి కమిట్అయితే ఇంక వర్మ గారు ఏ రేంజ్కి తీసుకెళ్తారో అందరికీ తెలిసిందే.. వర్మ సినిమాలో నటించిన హీరోయిన్లందరూ ఇప్పుడు ఒక విధంగా పాపులారిటీని సొంతం చేసుకొని సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక శ్రీలక్ష్మి అలియాస్ ఆరాధ్య కూడా బిజీ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం వర్మ తో మరో సినిమా చెయ్యాలని కండీషన్ పెట్టినట్లు బయట పెట్టింది. మొత్తానికి శారీ హీరోయిన్ ఆరాధ్య ఇంటర్వ్యూ వైరల్ అవడంతో వర్మ హీరోయిన్లను ఇలా కమిట్ అయ్యేలా చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
ఈ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజజీవిత సంఘటనల ఆధారాల తో సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ మూవీ రూపొందుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు RGV డెన్ లో ‘శారీ’ చిత్ర ట్రైలర్ ‘మాంగో మీడియా’ ద్వారా విడుదల చేశారు.. ఆ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ ఇష్టపడి ప్రేమ అంటూ వెంటతిరిగి ఆ ప్రేమ మరీ ఎక్కువయి, ఆ అమ్మాయి తనకే సొంతం అనే భావనతో సైకోగా మారి ఎలాంటి పనులు చేసాడు? ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో శారీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యదు, సాహిల్, అప్పాజీ అంబరీష్, కల్పలత.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..