BigTV English
Advertisement

OTT Movie : ఈ నిబ్బా నిబ్బి స్టోరీ చూస్తే జన్మలో లవ్ జోలికి వెళ్లరు… టీనేజర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : ఈ నిబ్బా నిబ్బి స్టోరీ చూస్తే జన్మలో లవ్ జోలికి వెళ్లరు… టీనేజర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : యుగాలు మారుతున్నా, మనుషుల మూఢనమ్మకాలు మాత్రం మారట్లేదు. ఎక్కడలేని పద్ధతులు, పాటింపులు మనుషులకు మాత్రమే ఉంటాయి. కొంతమంది మనుషులకన్నా, జంతువులే మేలు అనుకునే విధంగా కొన్ని సినిమాలు వచ్చాయి. నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. తక్కువ కులంలో పుట్టామని ఎదుటి వ్యక్తులు చులకనగా చూసే భావాన్ని తట్టుకోలేక, ఈ సమాజంపై ఓ యువకుడు  తిరగబడతాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ Zee5 లో

ఈ మరాఠీ మూవీ పేరు ‘ఫాండ్రీ‘ (Fandry). ఈ మరాఠీ మూవీకి నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించాడు. ఇందులో సోమనాథ్ అవ్ఘడే, సూరజ్ పవార్, రాజేశ్వరి ఖరత్ నటించారు. కుల వివక్ష మధ్య ఒక యువకుడి ప్రేమ కథను ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ MAMI ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ని గెలుచుకుంది. ఈ మూవీ 2014 ప్రేమికుల రోజున థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

హీరో తక్కువ కులానికి చెందిన పేద కుటుంబంలో జన్మిస్తాడు. వీళ్లు పందులను పెంచుకుంటూ ఊరికి దూరంగానే ఉంటారు. అయితే హీరో స్కూల్ కి వెళ్తూ, అగ్ర కులం అయిన ఒక అమ్మాయిని వన్ సైడ్ గా ప్రేమిస్తుంటాడు. ఆమెను దూరంగానే చూస్తూ సంతోషపడుతుంటాడు. అయితే హీరో అక్కకి ఒక సంబంధం కుదురుతుంది. వాళ్లు అడిగినంత కట్నం ఇవ్వలేకపోయినా, అందులో సగం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు హీరో తండ్రి. ఆ డబ్బు సమకూర్చే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో తయారుచేసిన వస్తువులను మార్కెట్లో అమ్ముకుని రావాలని హీరోకి తండ్రి చెప్తాడు. ఆ పని చేస్తుండగా అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెకు కనపడకుండా హీరో దాకకుంటాడు. తను తక్కువ కులంకు చెందిన వాడినని తెలిస్తే ఆమె ఎక్కడ దూరమవుతుందో అని అలా చేస్తాడు. అయితే ఆ ఊరిలో ఒక ఇంట్లోకి పందుల బెడద ఎక్కువ అవడంతో, వాటి బారి నుంచి తప్పిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తానని ఒక పెద్ద మనిషి హీరో తండ్రికి చెప్తాడు. కూతురు పెళ్లికి కట్నం గా ఆ పైసలు ఉపయోగపడతాయని, హీరో తండ్రి ఆ పందులను పట్టుకోడానికి బయలుదేరుతాడు.

ఈ క్రమంలో హీరో చదివే స్కూల్ దగ్గరికి ఆ పందులు వస్తాయి. అక్కడ హీరో తండ్రి వాటిని పట్టుకుంటూ, హీరోని కూడా సహాయం చేయమని అడుగుతాడు. అక్కడ ప్రేమించిన అమ్మాయి స్కూల్ లోపలికి వెళ్లిపోయిన తర్వాత హీరో వచ్చి ఆ పని మొదలు పెడతాడు. చాలా సేపటి తర్వాత వాటిని హీరో పట్టుకుంటాడు. అయితే ఇంతలోనే అక్కడికి స్కూల్ వాళ్లంతా వచ్చి హీరోను చూసి హేళనగా నవ్వుతారు. ఎవ్వరు హేలనగా మాట్లాడినా ఫర్వాలేదు గాని, లవ్ చేసే అమ్మాయి కూడా అలా నవ్వడంతో హీరో చాలా బాధపడతాడు. ఆ తరువాత రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుండగా, హీరో అక్కని చూసి కొంతమంది వ్యక్తులు చులకనగా మాట్లాడతారు. ఇన్ని రోజులు ఓపిక పట్టిన హీరోకి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. రాళ్ళతో వాళ్లపై దాడి చేస్తాడు హీరో. ఈ సన్నివేశంతో షాక్ తిన్న ఆ వ్యక్తులు, భయంతో అక్కడి నుంచి పారిపోతారు. చివరికి హీరో తన లైఫ్ ని ఎలా ముందుకు తీసుకు వెళ్తాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×