Nagachaithanya – Sobitha Wedding : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాగ చైతన్య శోభిత పెళ్లి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు గ్రాండ్ గా వీరి పెళ్లి జరగనుందన్న విషయం తెలిసిందే. మొదట వీరిద్దరూ విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొనున్నారని అప్పటిలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత హైదరాబాద్ లోనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహం జరగనుంది. దీంతో ఈ పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు? వధూ వరులిద్దరికీ ఎవరెవరు ఏమేం కానుకలు ఇవ్వనున్నారు? పెళ్లికి ఎంత ఖర్చులు అవుతున్నాయి అనే ప్రశ్నలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా నాగ చైతన్య పెళ్లి విందు మెనూ పై టాక్ నడుస్తుంది. మరి ఆ మెనూ లో ఏమున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ..
అక్కినేని వారసుడు నాగ చైతన్య – శోభిత దూళిపాల ల వివాహం డిసెంబర్ 4 వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి ఇళ్లలో పెళ్లి పనులు మొదలైయ్యాయి. వెడ్డింగ్ కార్డ్ కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. శోభిత ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం, మంగళ స్నానం, గౌరీ పూజ ఇతర సాంప్రదాయ క్రతువు ఘనంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలను శోభిత సిస్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వచ్చారు. ఇక మొత్తానికి మరి కొన్ని గంటల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు.
ఈ పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో ముస్తాబైంది. ఇక వీరి పెళ్లికి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానున్నారట. రామ్ చరణ్ – ఉపాసన, మహేశ్ బాబు – నమత్ర, ఎస్ఎస్ రాజమౌళి, నయనతార, ప్రభాస్, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, చిరంజీవి, వెంకటేశ్, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు హాజరుకానున్నారు. ఇక ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇండస్ట్రీలో, రాజకీయాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.. వీరి పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం జరగనుందని తెలిసిందే.. బుధవారం రాత్రి 8.13 నిముషాలకు జరగనుంది.
ఇదిలా ఉండగా పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను నాగార్జున సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ తో పాటు దేశం లోని వివిధ రకాల వంటలను తయారు చేయించారని టాక్.. ఆ మెనూ లో కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ, డజను బిర్యానీ వెరైటీలు, బంగాళదుంప కుర్మా, మామిడికాయ ప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, మజ్జిగ పులుసు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి లాంటి నోరూరించే వంటలను సిద్ధం చేసినట్లు సమాచారం.. ఈ వంటలకు అతిథులు ఫిదా అవ్వాల్సిందే మరి.. ఇక ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో అతిథులతో సందడిగా మారింది.