BigTV English

Telugu Cinema : కంటెంట్ లేని సినిమాలు.. రివ్యూలు బ్యాన్ చేయడం వల్ల ఆడేస్తాయా?

Telugu Cinema : కంటెంట్ లేని సినిమాలు.. రివ్యూలు బ్యాన్ చేయడం వల్ల ఆడేస్తాయా?

Telugu Cinema : ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఏ సినిమా కూడా థియేటర్లలో నిలబడటం లేదు. టాక్ పాజిటివ్ గా వచ్చినా జనాలు థియేటర్ కి వెళ్లడం లేదు. ఇందుకు ప్రమోషన్ లోపమా అంటే.. అలాంటిది ఏమీ లేదు. మేకర్స్ సినిమాలను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని చాలా సినిమా యూనిట్లు ఆ సినిమా స్టైల్లోనే ప్రమోషన్ చేసుకోవడానికి చూశాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం డే1 ఓపెనింగ్స్ లో అవి సగానికి సగం కూడా రాబట్టడం లేదు. మరి లోపం ఎక్కడుంది..?


‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి గట్టిగా ప్రమోషన్ చేయడం వల్ల జనాలు థియేటర్లకి వెళ్లారు అని సినిమా పెద్దలు చెబుతున్నారు. ఆ సినిమా వల్ల ఊర్లల్లో మూతబడ్డ థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. మరి మిగిలిన సినిమాలను కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేస్తున్నప్పుడు జనాలు ఎందుకు థియేటర్లకు వెళ్లడం లేదు.? ఈ విషయాలు పక్కన పెడదాం.

మరోపక్క మేకర్స్.. ‘మా సినిమాకి మంచి టాక్ వచ్చింది, కలెక్షన్స్ బాగున్నాయి’ అంటూ సక్సెస్ మీట్లు పెడతారు. మళ్ళీ అక్కడే.. ‘కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీలోకి కొత్త నిర్మాతలు రావట్లేదు’ అంటారు. వీటిని ప్రజలు ఏ ఏకంగా అర్ధం చేసుకోవాలి. వీళ్ళ మాటలను సీరియస్ గా తీసుకుని ఛాంబర్ పెద్దలు రివ్యూలను బ్యాన్ చేయాలి. కనీసం 2 రోజులు బ్యాన్ చేయాలి అంటారు. ఇందుకు నాగవంశీ వంటి పెద్దలు కూడా మద్దతు పలుకుతారు. అలాంటి నిర్మాతలే సినిమాకి పాజిటివ్ టాక్ కనుక చెబితే.. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వాటిని షేర్ చేస్తారు. ఇలాంటి వాటిని బట్టి సినిమా పెద్దల్ని ఎలా అర్ధం చేసుకోవాలి?


ఇక రివ్యూల గురించి కొంతమంది నటీనటులు ‘మీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. కానీ డిజాస్టర్ అనే మాటలు వాడకండి’ అంటారు. వాళ్ళైతే రివ్యూలు ఆపాలని కోరుకోవడం లేదు అంటున్నారు. సో రివ్యూలు ఆపడం అనేది సొల్యూషన్ కాదు.

సినిమాని ప్రమోట్ చేయడం అంటే ప్రమోషన్స్ ఎక్కువగా చేయడం కాదు..! తమ సినిమాలో ఉన్న సరైన కంటెంట్ ను జనాల్లోకి వెళ్లేలా చేయడం. అది చేస్తే టికెట్లు తెగుతాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ప్రమోషన్స్ బాగా చేస్తే హిట్ అయ్యింది అనేది కరెక్టే. కానీ ఆ సినిమాలో ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఆ ప్రమోషన్ ద్వారా చెప్పడం జరిగింది.

అనిల్ రావిపూడి, వెంకటేష్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించేది కామెడీ. అది అందులో పుష్కలంగా ఉంది.. అది ఎలా డిజైన్ చేశారు అనేది ప్రమోషన్ ద్వారా చెప్పారు. పాటల్లో కూడా విషయం ఉండటం ఇంకాస్త ప్లస్ అయ్యింది. ఇవన్నీ ఫిలిం మేకర్స్ గమనించాలి. సినిమాకి ప్రమోషన్ చాలా ముఖ్యం.దానికంటే ముందు సినిమాలో కంటెంట్ ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. ఇది ఫిలిం మేకర్స్ చెక్ చేసుకోవాలి. సరిచేసుకోవాలి.!

మరి రివ్యూల వల్ల ఎటువంటి సమస్యలు లేవా? అంటే ఉన్నాయి. కానీ మధ్యాహ్నం టైంలో ఇచ్చే రివ్యూల వల్ల కాదు. ఉదయం షో సరిగ్గా పూర్తవ్వకుండా కొంతమంది కెమెరాల ముందుకి వచ్చి చెప్పే ఫేక్ రివ్యూల వల్ల. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్ గా రివ్యూ చెబుతారు అనేది కూడా వాస్తవం. వీళ్ళ వల్ల మార్నింగ్ షోల తర్వాత టికెట్లు బుక్ అవ్వడం లేదు. ఇదివరకు మ్యాట్నీల టైంకి వెబ్సైట్ రివ్యూలు వచ్చేవి. వాటితో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగేవి. కొన్ని సినిమాలకి షో షోకి టాక్ బెటర్ అయ్యేది. ఒకవేళ మొదటి రోజు కంప్లీట్ గా టాక్ బాగోకపోతే రెండో రోజు నుండి థియేటర్లు ఖాళీ అయ్యేవి. ఇప్పుడైతే మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జనాలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి… వీడియో రివ్యూల కారణంగా ఏర్పడింది. ఇదైతే అక్షరసత్యం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×