Priyanka Jawalkar:సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అంటే నటనతో పాటు ప్రతిభ కూడా ఉండాలి. అయితే ఈ రెండు ఉంటే సరిపోతుందా..? ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామా? అంటే అదృష్టం కూడా తోడవ్వాలి..
ఎప్పుడైతే ఈ మూడు మన వైపు ఉంటాయో.. ఆటోమేటిక్ గా గుర్తింపుతో పాటు పరపతి కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం తీసిన ప్రతి సినిమా హిట్.. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. మరి అదృష్టం లేదంటారా..? లేక ఈ బ్యూటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదా? మరి ఈ తెలుగు బ్యూటీ కి అవకాశాలు రాకపోవడానికి గల అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
తీసిన ప్రతి సినిమా హిట్..
ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2017లో ‘కలవరం ఆయే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 2018లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonada)హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమెకు భారీగా అవకాశాలు కూడా తలుపు తడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ ప్రియాంకకు అవకాశాలు రాలేదు. చూడడానికి ముద్దుగా ఉండే ఈమె.. టాక్సీవాలా సినిమాతో భారీ పాపులారిటీ అయిపోయింది. కరోనా కారణంగా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కానీ అప్పట్లోనే భారీ పాపురాలిటీ తెచ్చుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకి చెందిన ప్రియాంక జవాల్కర్ తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది.
అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం..
‘ఎస్.ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా తరువాత చిన్న చిన్న సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ సూపర్ హిట్ సినిమాలలో అవకాశాలు రాలేదు. ఇక దీంతో ఈమె అభిమానులు అందం వుంది , తెలివి ఉంది.. కానీ ఆ ప్రతిభకు తగ్గట్టుగా అవకాశాలు రావడం లేదు ఎందుకు ప్రియాంక..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఆఫర్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులలో అటెన్షన్ క్రియేట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . వరుసగా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటోంది.
ప్రియాంక జవాల్కర్ కెరియర్..
ప్రియాంక విషయానికి వస్తే.. 1992 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో జన్మించిన ప్రియాంక జవాల్కర్.. పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు. అనంతపురంలోనే స్థిరపడ్డారు. ఇక పదవ తరగతి వరకు అనంతపురంలోనే ఎల్.ఆర్.జీ హైస్కూల్లో చదువు పూర్తి చేసిన ఈమె, ఆ తర్వాత హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇండస్ట్రీ లోకి రాకముందు నటనపై ఆసక్తి ఉన్న ఈమె ఎన్ జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకొని ,ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇకపోతే ఈమె టాక్సీవాలా, గమనం , ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరసు వంటి చిత్రాలలో నటించింది. అన్ని విజయం సాధించాయి. కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు. మరి ఇకనైనా ప్రియాంకకు అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.