BigTV English

Abhishek Sharma Century: 28 బంతుల్లో సెంచరీ చేసిన SRH ప్లేయర్ !

Abhishek Sharma Century: 28 బంతుల్లో సెంచరీ చేసిన SRH ప్లేయర్ !

Abhishek Sharma Century: టీమిండియా స్టార్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను బ్యాటింగ్ చేయడానికి గ్రౌండ్లో అడుగుపెట్టిన అప్పటినుంచి… సిక్స్ లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తాకితే 6, లేకపోతే ఫోర్… అది కాకపోతే క్యాచ్ అవుట్.. ఇలా ఉంటుంది హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్. అందుకే అతన్ని మరో వీరేంద్ర సెహ్వాగ్ గా పిలుస్తారు. బ్యాటింగ్ మొదలైన నుంచి… టెస్ట్, వన్డే లేదా టి20 ఇలా ఏ ఫార్మాట్ అయిన… అభిషేక్ శర్మ ( Abhishek Sharma).. దంచుతూనే ఉంటాడు.


Also Read: IND VS AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ డేంజర్ బ్యాటర్ ( Abhishek Sharma)… తన బ్యాటింగ్ తో దుమ్ము లేపాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ హైదరాబాద్ క్రికెటర్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లేకపోవడంతో… సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ( Syed Mushtaq Ali Trophy) ఆడుతున్నాడు హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma). అయితే ఈ టోర్నమెంటులో 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని సంచలనాన్ని సృష్టించాడు ఈ యంగ్ క్రికెటర్.


28 బంతుల్లో నే సెంచరీ చేసుకున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma)… 11 సిక్సర్లు అలాగే 7 ఫోర్ లతో రచ్చ చేశాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో  ( Syed Mushtaq Ali Trophy) భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో… ఈ దుమ్ము లేపే బ్యాటింగ్తో రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ. అయితే పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma). ప్రస్తుతం యువరాజ్ సింగ్ నేతృత్వంలో ట్రైనింగ్ తీసుకుంటున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma)… మేఘాలయ బౌలర్లను చీల్చి చెండాడాడు.

ALSO READ: Sachin – Vinod Kambli: ఒకప్పుడు దోస్తులు..మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ..!

దీంతో మేఘాలయ జట్టు పైన పంజాబ్ అవలీలగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ 9 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లలో 142 పరుగులు చేయగలిగింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడం లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సూపర్ షో ఉపయోగపడింది. దీంతో 9.3 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయిన పంజాబ్ జట్టు… 143 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్.

అయితే సెంచరీ తో దుమ్ము లేపిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మొన్నటి ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన అభిషేక్ శర్మ ( Abhishek Sharma).. ప్రతి మ్యాచ్ లోను విధ్వంసకర బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫైనల్ వరకు హైదరాబాద్ జట్టు వెళ్లింది. ఇక దీని ఫలితంగానే అతని రిటైన్ కూడా చేసుకుంది కావ్య పాప.

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×