Prabhas : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఒక్కో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ముందుగా రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఫౌజీ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన విషయం తెలిసిందే.. ఈ మూవీ గురించి నెట్టింట రోజుకో వార్త వినిపిస్తుంది. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ ఇదే అంటూ ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి చూద్దాం..
ప్రభాస్ గత ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆయన బిజీగా వరుస సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాజా సాబ్ తర్వాత ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ పై ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.
ఈ మూవీలో ప్రభాస్ సైనికుడుగా నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దాంతో పాటు ఆయన ఈ సినిమాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడట. ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ మధురై సమీపంలోని కారైకుడి ప్రాంతంలో బ్రాహ్మణుడి పాత్రకు సంబందించిన షూటింగ్ జరగనుందని సమాచారం.. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు సాగనుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్.. మరి ఆ లుక్ లో డార్లింగ్ నిజంగానే కనిపిస్తాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ లుక్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. కొందరు లుక్ అదిరిపోయిందని అంటే, మరికొందరు మాత్రం ఏం బాగోలేదు. యాక్షన్ హీరోకు ఇలాంటి గెటప్ సూట్ అవ్వదు అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. మరి డైరెక్టర్ ప్లానేంటో తెలియాలంటే షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే..
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. రెండేళ్లుగా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సలార్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు.. గత ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇక రాజా సాబ్ తో పాటుగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2,సలార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు.