Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్టు అడుగు పెట్టిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కష్ట కాలంలో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కు రష్మిక ఆడుకుంటుందా? అనే చర్చ మొదలైంది. మరి ‘సికందర్’ (Sikandar) మూవీకి ఈ అమ్మడి ఛార్మింగ్ లక్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? అనే వివరాల్లోకి వెళ్తే…
‘సికందర్’కు రష్మిక సెంటిమెంట్
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘సికందర్’. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ను మాత్రం భారీ స్థాయిలో నిర్వహించలేదు మేకర్స్. చిన్న చిన్న ప్రెస్ మీట్ల ద్వారానే పని కానిచ్చారు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ చిత్రం సినీ ప్రేక్షకులలో ఆశించిన స్థాయిలో ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. దీంతో రష్మిక సెంటిమెంటే ఈ మూవీని కాపాడాలని అంటున్నారు.
ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఆమె ‘యానిమల్’, ‘చావా’ చిత్రాలతో వరుసగా భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలు కూడా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ‘పుష్ప’ మూవీతో మొదలైన రష్మిక విజయ పరంపర ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
మరోవైపు సల్మాన్ గత చిత్రాలు అంచనాలను అందుకోకపోవడంతో వరుస పరాజయాలను చవిచూస్తున్నాడు. ఇలా డిజాస్టర్ ఫేజ్ లో ఉన్న సల్మాన్ దాదాపు ఏడాది గ్యాప్ ఇచ్చి ‘సికందర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్న ఆయన తనకు అచ్చి వచ్చిన ఈడ్ పండగకు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఒకవేళ మేకర్స్ కావాలనే లో బజ్ మెయింటైన్ చేస్తుంటే గనుక… మూవీకి ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది అన్నది వాస్తవం. అందుకే ఈ మూవీని రష్మిక లక్ కాపాడుతుందా? రష్మిక ఫామ్ ‘సికందర్’కి అనుకూలంగా పని చేస్తుందా ? సల్మాన్ కు అవసరమైన సాలిడ్ కం బ్యాక్ ఇస్తుందా? అనేది చూడాలి.
సెన్సార్ ఫార్మాలిటీల తర్వాత మేకర్స్ ‘సికందర్’ మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఇప్పుడు ఈ చిత్రం 2 గంటల 16 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రాబోతోంది. సాజిద్ నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ కు చెందిన నిర్మాత సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), సత్యరాజ్ (sathyaraj) కీలక పాత్రలు పోషించారు.