Iraq Girls Wedding Age| ఒకప్పుడు మహిళలందరూ చదువుకునేందుకు స్వేచ్ఛ ఉండాలని చెప్పిన సద్దాం హుస్సేన్ పాలించిన ఇరాక్ దేశంలో ఇప్పుడు మతోన్మాదులు రాజ్యమేలుతున్నారు. తాజాగా ఇరాక్ పార్లమెంటులో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రకారం.. మహిళల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గించనున్నారు. ఇప్పటివరకు ఇరాక్ లో మహిళ కనీస వయసు 18 ఉండగా అందులో మార్పులు చేయబోతున్నారు. అయితే ఈ మార్పుతో రాబోయే చట్టం వల్ల అమ్మాయిల జీవితాలు నాశనమవుతాయని.. వారికి మంచి భవిష్యత్తు ఉండదని చెబుతూ సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొత్త చట్ట ప్రకారం.. అబ్బాయి కనీస వయసు కూడా 15 ఏళ్లకు తగ్గిస్తున్నారు. దీని వల్ల బాల్య వివాహాలు పెరిగిపోతాయని మహిళా సంఘాలు నిరసనలు చేస్తూ రోడ్డుకెక్కారు. దీంతో ఈ కొత్తచట్టం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లు అనుమతిపొంది చట్ట రూపం దాలిస్తే.. దేశం అభివృద్ధి కాదు అనాగరికత జరుగుతుందని మానవ హక్కుల సంఘం కార్యకర్త సారా సన్బర్ అభిప్రాయపడ్డారు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
9 ఏళ్ల అమ్మాయిలకు వివాహం చేస్తే.. వారు త్వరగా గర్భం దాల్చడం జరుగుతుందని.. ఆ తరువాత వారి ఆరోగ్యం దెబ్బతినడం.. చిన్నవయసులో మానసిక పరిపక్వత లేక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయని ఇరాక్ మహిళా సంఘం సభ్యురాలు అమల్ కబాషీ అన్నారు. తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న మహిళలు గృహ హింసకు గురవుతున్న కేసులు ఎన్నో ఉన్నాయని.. దీని వల్ల మహిళా హక్కులను కాలరాయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. 9 ఏళ్ల పిల్లలు స్కూలు చదువుకుంటూ కనపడాలి, లేదా మైదానంలో ఆడుకుంటూ కనపడాలి అంతే కానీ వివాహ దుస్తుల్లో కాదు అని ఆమె వ్యాఖ్యలు చేశారు.
మహిళల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుండాలని ఇరాక్ లో 1959లోనే చట్టం చేశారు. ఈ చట్టాన్ని ఇరాక్ చివరి శాసకుడు సద్దాం హుస్సేన్ కఠినంగా అమలు పరిచారు. అమెరికా ఆయనను హత్య చేసిన తరువాత నుంచి ఇరాక్ లో గత 20 ఏళ్లుగా సరైన పాలనా విధానం లేదు. సద్దాం హుస్సేన్ ని వ్యతిరేకించే షియా ముస్లింలు.. అమెరికా సహాయంతో అధికారంలో ఉన్నారు. తాజాగా వివాహ కనీస వయసు తగ్గించే చట్టాలను తీసుకొస్తున్నదీ షియా నాయకులే.
Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్
నిజానికి జూలై 2024లో ఈ కొత్త చట్టం తీసుకురావాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. వివాహ వయసు తగ్గించడం ద్వారా సమాజంలో అక్రమ సంబంధాలు తగ్గిపోతాయని అధికార పార్టీ వాదన. అందుకే కొత్త చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన అధికారాలన్నీ మత పెద్దలకు అప్పగించడం జరుగుతుందని తెలిపింది. కానీ ఈ చట్టం పట్ట తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్ని రోజులు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 4న దీన్ని ప్రవేశపెట్టారు.
Also Read: ‘డబ్బులిస్తేనే శృంగారం’.. భార్య డిమాండ్.. కోర్టుకెక్కిన భర్త!