Prasanna Kumar : టాలీవుడ్ ప్రముఖ రచయితలల్లో ప్రసన్న కుమార్ కూడా ఒకడు.. ఎన్నో సినిమాలాక్ రచయిత పనిచేసారు..ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన స్టార్ హీరో వెంకటేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మించి మోసం చేసారంటు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన బాధను అర్థం చేసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యాటరేంటో ఒకసారి తెలుసుకుందాం..
రైటర్ గా ప్రసన్న కుమార్ సినిమాలు..
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ తెలుగు సినీరంగానికి చెందిన సినిమా రచయిత, పాటల రచయిత. ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసి సినిమా చూపిస్త మావ సినిమా ద్వారా రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టి, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలతో మంచి గుర్తింపునందుకున్నాడు. ఆ తర్వాత ధమాకా, విశ్వక్ సేన్ సినిమాకు రైటర్ గా వ్యవహారించారు. నా సామి రంగా మూవీ భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా సందీప్ కిషన్ తో మజాకా మూవీకి రచయితగా వ్యవహారించారు. ఈయన కెరియర్ లో హిట్ సినిమాలు ఎలా ఉన్నాయో అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.. అయితే పలు చానల్స్ కి ఎప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటారు ప్రసన్నకుమార్. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కొన్ని సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విక్టరీ వెంకటేష్ గురించి కొన్ని విషయాలను బయట పెట్టాడు.
Also Read :రూటు మార్చిన సూర్య.. పవర్ ఫుల్ పాత్రలో ..
వెంకటేష్ అవమానించాడా..?
రైటర్ ప్రసన్న గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేసారు.. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. తన సినిమాల గురించి ఎన్నో విషయాలను షేర్ చేశాడు. ఈ సందర్బంగా కొన్ని సినిమాల విషయంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితిల గురించి చెప్పి ఫీల్ అయ్యాడు.. అయితే హీరో వెంకటేష్ దగ్గరకు కథను వినిపించడానికి వెళ్లాను అక్కడకు వెళ్ళినప్పుడు బాగానే రిసీవ్ చేసుకున్నాడు. కథ విని ఒకే అన్నాడు. ఆ తర్వాత షూటింగ్ గురించి అడిగితే నో అన్నాడు.. మా అన్నయ్యకు ఒకసారి చెప్పమని చెప్పాడు. సురేష్ గారికి నేను కథను చెప్పాను.. ఆయన వద్దని చెప్పడంతో సినిమాను క్యాన్సిల్ చేశారు. అందుకే ఆ తర్వాత వెంకటేష్ తో సినిమా చెయ్యలేదు. నాకు అవమానంగా అనిపించింది అని అన్నాడు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… రీసెంట్ గా వచ్చిన మజాకా మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలకు కథ రాస్తున్నట్లు తెలుస్తుంది.