BigTV English

Yash New Movie Update : మత్తెక్కించడానికి టాక్సిక్ తో వస్తున్న కేజీఎఫ్ హీరో..

Yash New Movie Update : మత్తెక్కించడానికి టాక్సిక్ తో వస్తున్న కేజీఎఫ్ హీరో..

Yash New Movie Update : చత్రపతి సినిమాలో ఒక్క అడుగు అనే పవర్ఫుల్ డైలాగ్ గుర్తుందా.. అదిగో ఒక్క అడుగు అని ఆ సినిమాలో మొత్తం చీకటి సామ్రాజ్యాన్ని కమ్మేస్తాడు హీరో.. ఒక్క సినిమా అంటూ హీరో యశ్ కేజీఎఫ్ తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయాడు. అప్పటివరకు అతని గురించి పెద్దగా తెలియని వాళ్ళకి కూడా.. ఆ పేరే ఒక బ్రాండ్ గా మారింది. పవర్ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ 19 వ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రానే వచ్చింది.


యశ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గురించి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టాక్సిక్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈ మూవీకి మేకర్స్ ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు వీడియోలో యశ్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేసారు మేకర్స్. పిక్చర్ క్లియర్ గా లేకపోయినా కటౌట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంది అంటున్నారు అభిమానులు. టాక్సిక్ పేరు హైలెట్ అవుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో తుపాకీ పట్టుకొని భారీ పర్సనాలిటీతో యశ్ కనిపించాడు.

కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ ,కన్నడ ,మలయాళం, హిందీ భాషలలో విడుదల అవుతుంది. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు గీతూ మోహన్ దాస్ వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ మరియు ఇతర ముఖ్యమైన పాత్రలు కు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని టాక్.


కే జి ఎఫ్ సిరీస్ మూవీస్ తో దేశవ్యాప్తంగా సాలిడ్ అభిమానులను సంపాదించుకున్నాడు యశ్. రాఖీ బాయ్ గా ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసిన ఈ స్టార్ హీరో నుంచి రాబోయే చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేజిఎఫ్ మూవీతో ఫేమ్ వచ్చింది కానీ.. అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ కూడా అతని చిత్రాలపై పెరిగాయి. దీంతో కొన్ని నెలలుగా కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి కుదరలేదు. నెక్స్ట్ రాబోయే మూవీ కేజిఎఫ్ నుంచి ఉండాలి అని అభిమానులు ఆశిస్తారు కాబట్టి స్టోరీని ఆచితూచి ఎన్నుకోవాలి.

అందుకే ఇన్ని రోజులు యశ్ కసరత్తు పట్టాడట. ఇదిగో ఇప్పుడు ఫైనల్ గా టాక్సిక్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.పదుల సంఖ్యలో స్టోరీస్ పై రీసెర్చ్ చేసి ఫైనల్ గా సంవత్సరం పాటు కష్టపడి ఈ స్టోరీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ స్టోరీ టైటిల్ తో పాటు .. ఎ ఫేరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్.. అనే క్యాచీ ట్యాగ్ లైన్ ని పెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని టాక్.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×