BigTV English

PSLV-C59 Launch: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా.. సాంకేతిక లోపాన్ని గుర్తించిన స్పేస్.. మళ్లీ ఎప్పుడంటే?

PSLV-C59 Launch: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా.. సాంకేతిక లోపాన్ని గుర్తించిన స్పేస్.. మళ్లీ ఎప్పుడంటే?

PSLV-C59 Launch: కాసేపట్లో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం ప్రారంభమయ్యే సమయంలో ఇస్రో కీలక ప్రకటన చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ముందుగా ఇస్రో తెలిపింది. నేటి సాయంత్రం 4:08 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 వీటిని నింగిలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా, శాటిలైట్‌లో సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడింది.


సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన బృహత్తర మిషన్ కాగా, ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కొరొనా గురించి తెలుసుకునే ప్రయత్నం సాగించేందుకు ఈ ప్రయోగం దోహద పడనుంది. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయానైజ్డ్ గ్యాస్.. వంటి అంశాలపై ఈఎస్ఏ అధ్యయనం చేయడం ప్రయోగం ముఖ్య లక్ష్యం.

అయితే మరికొద్ది గంటల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సాగాయి. కానీ అంతలోనే శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ నిలిపివేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ ను రేపు సాయంత్రం 4.12 గం.కు ప్రయోగించడం జరుగుతుందని ప్రకటన జారీ చేసింది.


Also Read: Mahalakshmi Foundation: ఆ ఊరే ఓ అద్భుతం.. ఆడపిల్ల పుడితే అక్కడి సంప్రదాయమే వేరు..

కాగా నేటి సాయంత్రం ప్రయోగం సఫలమయ్యేందుకు ఇస్రో సన్నద్దం కాగా, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వెంటనే ప్రయోగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం రేపు సాగుతుండగా, సూర్యుడిపై పరిశోధనల కోసం దీనిని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు శాస్త్రవేత్తలు. రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ప్రయోగం వాయిదా వేసినట్లు తెలుసుకున్న వారు, రేపు అనగా గురువారం రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×