Trump Vs Musk : అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా ? డెమోక్రాట్లు, రెపబ్లికన్లకు పోటీగా మూడో పార్టీ రానుందా ? పార్టీ పేరు కూడా కన్ఫామ్ అయ్యిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ చేస్తున్న పోస్టులు చూస్తే.. త్వరలో కొత్త పార్టీ రావడం గ్యారంటీ అనే భావన కలుగుతోంది.
80శాతం మంది సపోర్ట్
అమెరికాలో కొత్త పార్టీ పెట్టడంపై మరో లీక్ ఇచ్చారు మస్క్. 80 శాతం అమెరికన్లకు ప్రాతినినిథ్యం వహించే కొత్త పార్టీ అవసరం ఉందా అంటూ, రెండ్రోజుల క్రితం పోల్ పెట్టారాయన. ఆ పోల్‌కు సంబంధించిన ఫలితాలను రీ పోస్ట్ చేశారు. ఈ పోల్‌కు 56 లక్షల మందికి పైగా ఓటింగ్ వేశారు. కొత్త పార్టీ పెట్టాలంటూ 80 శాతం మంది ఓటు వేశారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని, ది అమెరికా పార్టీ అంటూ పోస్టు పెట్టారాయన. ఇప్పుడిది హాట్ టాపిగ్గా మారింది.
ట్రంప్ వర్సెస్ మస్క్
గత అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్.. ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. క్యాంపైన్ మొత్తం భుజాలపై వేసుకున్నారు. ఫండ్ రైజింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ట్రంప్ ఎలక్షన్ టీమ్‌లో మస్క్ కీలక సభ్యుడిగా ఉన్నారు. ట్రంప్‌ను గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషించారు. దీనికి ప్రతిఫలంగా మస్క్‌కు డోజ్ బాధ్యతలు అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు ఇద్దరి మధ్య దూరం పెంచింది. బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ.. డోజ్ పదవికి సైతం రిజైన్ చేశారు. ట్రంప్‌ను తానే గెలిపించానంటూ హాట్ కామెంట్లు చేశారు. దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. తనని ఎవరూ గెలిపించలేదని, తన సత్తాతోనే గెలిచానన్నారు.
ది అమెరికా పార్టీ..
ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ మస్క్ ఈగోని హర్ట్ చేశాయి. ఆ వెంటనే X వేదికగా ఆయన ఓ పోల్ నిర్వహించారు. 80శాతం అమెరికన్ల కోసం ఓ పార్టీ ఉండటం అవసరమా అంటూ పోల్ నిర్వహించారు. దానికి అనుకూలంగా నెటిజన్లు ఓటు వేశారు. దాంతో ది అమెరికన్ పార్టీ అంటూ ఆ పోల్ ఫలితాలను పోస్టు చేశారు మస్క్. ఐతే పార్టీ పెడుతున్నట్లు కానీ, ఇదే పార్టీ పేరని గానీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు. స్వయంగా మస్క్ పార్టీ పెడతారా ? ఇతరులతో పెట్టిస్తారా అన్నది కూడా తెలియదు.
మాస్క్ పార్టీ పెడితే..
అమెరికాను పాలించేవి రెండే పార్టీలు. ఐతే డెమోక్రాట్లు, లేదంటే రిపబ్లికన్లు. అమెరికన్లు చచ్చినట్టు ఈ రెండు పార్టీలకే ఓటు వేయాలి. ఇంకో ఆప్షనే లేకుండా పోయింది. ఒకటి రెండు చిన్నా చితక పార్టీలు ఉన్నా, అవి రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయ్. ఒకవేళ మస్క్ పార్టీ వస్తే, అమెరికా పొలిటికల్ సినారియో పూర్తిగా మారిపోనుంది. మస్క్ ఆర్థికంగా బలమైన వ్యక్తి. మంచి ప్రజాధరణ ఉంది. దానికి మించి చేతిలో X లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉంది. అమెరికన్లను ఎట్రాక్ట్ చేసే స్కిల్స్ ఉన్నాయ్. పైగా గత ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన అనుభవం కూడా ఉంది.
అక్కడ చాలా తేడా..
ఇక.. యూఎస్ ఎన్నికల విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది కూడా ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా ఉంటుంది. బ్యాటిల్ గ్రౌండ్ లాంటి రాష్ట్రాల్లో విన్నర్స్ టేక్స్ ఆల్..అనే విధానం ఉంది. అంటే గెలిచిన పార్టీకి అన్ని సీట్లు వెళ్లిపోతాయి. దాంతో చిన్న పార్టీలు పోటీ చేసి వృథా అవుతోంది. అందుకే ఎవరూ పార్టీ పెట్టే సాహాసం చేయలేకపోతున్నారు.