Chiranjeevi: ప్రస్తుతం సీనియర్ హీరోలు మరింత అలర్ట్‌గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఓవైపు కొందరు యంగ్ హీరోలు రొటీన్ సినిమాలు చేస్తూ హిట్లు అందుకోలేక వెనకబడుతుంటే.. కొందరు సీనియర్ హీరోలు మాత్రం తమ వయసుకు తగిన పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అంతే కాకుండా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కూడా సీనియర్ హీరోలే యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్‌తో ప్రేక్షకులకు బోర్ కొట్టించిన చిరు.. ఇప్పుడు రూటు మార్చారు. ఒరిజినల్ కథలనే ఎంచుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది.
ఆసక్తికర అప్డేట్
అసలు సీనియర్ హీరోలను యంగ్ దర్శకులు ఎలా హ్యాండిల్ చేస్తారా అనే అనుమానం ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మారిపోయింది. యంగ్ డైరెక్టర్లే సీనియర్ హీరోలకు హిట్లు ఇవ్వగలరు అనే నమ్మకం వచ్చేసింది. అందుకే హీరోలు సైతం యంగ్ దర్శకులకు ఛాన్సులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లను నమ్మి ఫ్లాపులు ఎదుర్కున్న చిరంజీవి సైతం ఇప్పుడు వశిష్ట, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్లను నమ్ముకున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి.. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోకు మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇవ్వగా తను చిరంజీవితో చేసే సినిమా కూడా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. తాజాగా చిరు, అనిల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీపై ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
తనే ఫిక్స్
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లోని మూవీ తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ఎవరు, ఇతర క్యాస్టింగ్ ఎవరు, విలన్ ఎవరు అనే విషయాలపై క్లారిటీ లేదు. కానీ తాజాగా చిరు, అనిల్ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో కార్తికేయ నటించనున్నాడనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం హీరోగా ఫామ్‌లోని లేని కార్తికేయకు ఇది మంచి ఛాన్స్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా కార్తికేయకు విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొత్తేమీ కాదు.
Also Read: అల్లు అర్జున్‌తో మృణాల్ ఠాకూర్.. సీన్‌లోకి మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్
విలన్ పాత్రలు వద్దు
నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో విలన్‌గా మారాడు కార్తికేయ (Karthikeya). విలన్‌గానే అందరినీ ఎక్కువగా ఇంప్రెస్ చేశాడు కార్తికేయ. అందుకే తనకు బ్యాక్ టు బ్యాక్ విలన్‌గానే అవకాశాలు వచ్చాయి. కానీ హీరోగా తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం విలన్ సైడ్ వెళ్లలేదు. మళ్లీ అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’లో విలన్‌గా కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలు చేయను అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. కానీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే కార్తికేయ కూడా నో చెప్పలేడు కాబట్టి అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.