Sarangapani Jathakam Movie Review : ‘కోర్ట్’ తో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అతను హిట్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశాడో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ :
సారంగపాణి (ప్రియదర్శి) జాతకాలు ఎక్కువగా నమ్మే ఈతరం కుర్రాడు. ఏ పనిచేయలన్నా ముందు జాతకం చూశాక కానీ మొదలుపెట్టాడు. ఒక కార్ షోరూమ్ లో ఇతను సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే షోరూంలో మేనేజర్ అయినటువంటి మైథిలి(రూప కొడువాయూర్) తో ప్రేమలో పడతాడు. చాలా కాలం ఇతని లవ్ ప్రపోజల్ ను ఆమె యాక్సెప్ట్ చేయదు. అయితే ఒకరోజు వెళ్లి అతనికి ప్రపోజ్ చేస్తుంది. వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు.
ఈ క్రమంలో జిగ్నేశ్వర్(అవసరాల శ్రీనివాస్) సారంగపాణి లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతను ఎంట్రీ ఇచ్చినప్పటికీ నుండి.. సారంగపాణి లైఫ్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ సమస్యలు ఏంటి? వాటి వల్ల అతని లవ్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయ్యింది? ఈ క్రమంలో సారంగపాణి స్నేహితులు చందు(వెన్నెల కిషోర్),రాంకీ(వైవా హర్ష) ఎలా సాయపడ్డారు? చివరికి సారంగపాణి – మైథిలి పెళ్లి చేసుకున్నారా? అసలు జిగ్నేశ్వర్ సారంగపాణి లైఫ్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా?
విశ్లేషణ :
ఇంద్రగంటి మోహన్ కృష్ణ రైటింగ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా కామెడీ విషయంలో అతని మార్క్ వేరు. ‘వి’ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాల్లో అది మిస్ అయ్యింది. తన మార్క్ కాని జోనర్ ను టచ్ చేయడం వల్ల ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఆ తప్పు వెంటనే గ్రహించి ‘సారంగపాణి జాతకం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడి వరకు ఓకే. అయితే ఇది ఎప్పుడో డిసెంబర్లో రావాల్సిన సినిమా. దాదాపు 5 నెలలు వాయిదా పడి ఇప్పుడు వచ్చింది. అనుకున్న టైంకి కనుక వచ్చి ఉంటే ఇంకాస్త బాగుండేదేమో. ఇప్పుడైతే జనాలు థియేటర్ కి ఎక్కువగా రావడం లేదు.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… ‘సారంగపాణి జాతకం’ ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా గడిచిపోతుంది. అయితే ఇంటర్వెల్ కి వచ్చేసరికి కొంచెం ఊహించని టర్న్ తీసుకుంటుంది. కొన్ని సంభాషణలు శృతి మించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో. అది కొత్తదేమీ కాదు. ఓ పదేళ్ల క్రితం పలు సినిమాల్లో వచ్చిన లైన్ ఇది.అలా అని అప్పటి సినిమా కూడా ఒరిజినల్ స్టోరీతో వచ్చింది కాదు. ఓ నవల ఆధారంగా రూపొందింది. బహుశా ఇంద్రగంటి ఈ మధ్య ఆ నవల చదివి ఉండొచ్చు. అయితే దీనికి అతని శైలి కామెడీని జోడించడం అనేది అందరితో టైం పాస్ చేయించే విషయం.
సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ మధ్య వచ్చే వెన్నెల కిషోర్, హర్ష, ప్రియదర్శి..ల ట్రాక్ హిలేరియస్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ను కూడా బాగా డిజైన్ చేశారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి ఎంత అవసరమో అంత వరకు ఖర్చు చేశారు. అంతకు మించి తక్కువ చేసింది లేదు. మ్యూజిక్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అవి టార్గెటెడ్ ఆడియన్స్ కి మాత్రమే. ఇక సినిమాటోగ్రఫీ వంటికివి కూడా బాగానే వర్కౌట్ అనిపిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే.. ‘కోర్ట్’ వంటి సీరియస్ మూవీ తర్వాత ప్రియదర్శి ఈ సినిమా చేశాడు అనడానికి లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడో దానికంటే ముందే కంప్లీట్ అయిన సినిమా. అంతకు ముందు ప్రియదర్శి ఎక్కువగా చేసింది ఇలాంటి పాత్రలే. కాబట్టి ఇది అతనికి టఫ్ గా అనిపించే పాత్ర కాదు. మరోపక్క రూప నిజంగానే టాలీవుడ్ సాయి పల్లవి అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో ఆమె గురించి ఎక్కువగా టీం ఇలా చెబుతుంటే అతిశయోక్తేమో అనిపిస్తుంది కానీ.. ఆమె లుక్స్, డాన్స్ వంటివి చూస్తే నిజమే అనిపించక మానదు. వెన్నెల కిషోర్, హర్ష, సీనియర్ నరేష్..ల కామెడీ వర్కౌట్ అయ్యింది. శివన్నారాయణ, తనికెళ్ళ భరణి కూడా తమ మార్క్ పెర్ఫార్మన్స్ తో అలరించారు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
డైరెక్షన్
క్లైమాక్స్
నటీనటుల పనితీరు
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ స్టోరీ
కొన్ని సంభాషణలు
మొత్తంగా… ‘సారంగపాణి జాతకం’ రెగ్యులర్ కథతో, ప్రెడిక్టబుల్ నేరేషన్ తో సాగినప్పటికీ.. నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. కామెడీ కోసం ఒకసారి థియేటర్లలో చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.
Sarangapani Jathakam Movie Rating : 2.5/5