Ram Charan vs Allu Arjun: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది నటులుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. బయట హీరోలతో మాత్రమే కాదు.. మెగా హీరోల్లో కూడా వారితో వారికే పోటీ ఉంటుంది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని కాకుండా మెగా హీరోలు అందరిలో ఈ పోటీ ఉంది. ముఖ్యంగా గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అనే పోటీ నడుస్తోంది. ఒకప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా హీరోనే అయినా రాజకీయ విషయాల్లో మనస్పర్థలు రావడం వల్ల తను మెగా హీరో నుండి అల్లు హీరోగా మారిపోయాడు. అలా అల్లు అర్జున్ వర్సెస్ మెగా హీరోలు అని పోటీ మొదలయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ట్రెండ్ నడుస్తోంది.
ఎన్నో పోలికలు
గత కొన్నిరోజులుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏం చేసినా కూడా వారి అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్స్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. వారి సినిమాలు విడుదలయినప్పుడు మాత్రమే కాదు.. వారు చేసే ప్రతీ విషయంలో ఇద్దరినీ పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలా తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘పెద్ది’కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఆ ఫస్ట్ లుక్ కూడా ‘పుష్ప’ లుక్ లాగానే ఉందంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది పక్కా కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పోటీ మొదలయ్యిందో లేదో అప్పుడే ఈ రెండు సినిమాల ఆడియో రైట్స్ గురించి కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆడియో రైట్స్‌లో పోటీ
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవ్వలేదు. ఇంతలోనే ఈ మూవీ ఆడియో రైట్స్ రూ.45 కోట్లకు అమ్ముడు పోయాయనే విషయం బయటికొచ్చింది. టీ సిరీస్ సంస్థ ఈ ఆడియో రైట్స్‌ను కొనుగోలు చేసిందట. అయితే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ ఆడియో రైట్స్ అప్పట్లోనే రూ.54 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. పోస్టర్ చూడడానికి ‘పుష్ప’ లాగా ఉన్నా ఆ రేంజ్‌ను మాత్రం అందుకోలేదు అన్నట్టుగా రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దీంతో మరోసారి ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ మొదలయ్యింది.
Also Read: ‘పెద్ది’ వేగంగానే.. అలా చూస్తే బుచ్చి మావాకి థాంక్స్ చెప్పాల్సిందే
బ్రాండ్‌కు వాల్యూ లేదు
బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి బ్రాండ్ ఉన్నా కూడా ఈ సినిమా ఆడియో రైట్స్ కేవలం రూ.45 కోట్లకు మాత్రమే అమ్ముడుపోవడం ఏంటి అని ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఒక తెలుగు సినిమాకు సంగీతాన్ని అందించి చాలాకాలం అయ్యింది. ఆయన పేరు చూసి కూడా టీ సిరీస్ ఇంత తక్కువకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసిందంటే కాస్త షాకింగ్‌గానే ఉందనుకుంటున్నారు. పైగా ఇప్పటికే రామ్ చరణ్‌కు ‘పెద్ది’ ఫస్ట్ లుక్ నచ్చలేదని టాక్ నడుస్తుండగా.. ఈ ఆడియో రైట్స్ వల్ల తను మరింత డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.