Ram Charan.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది అనగా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ కాంబినేషన్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే ఏపీలోని విజయవాడలో బృందావన్ గార్డెన్ లో ఉన్న వజ్ర గ్రౌండ్స్ లో రామ్ చరణ్ కు అభిమానులు అరుదైన గౌరవాన్ని అందించారు. వజ్ర గ్రౌండ్స్ లో 256 అడుగుల భారీ రామ్ చరణ్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దానిని నిన్న సాయంత్రం లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా హీరోలు..
మరోవైపు త్వరలోనే ఏపీలో కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. అందుకు సంబంధించిన సన్నహాలు కూడా పూర్తవుతున్నాయి. దీనికి తోడు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్(Allu Arjun), చిరంజీవి(Chiranjeevi ), పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ కి మెగా హీరోలను తీసుకురావడమే కాకుండా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇవ్వడానికే ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ నిజంగానే వస్తాడా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.
రామ్ చరణ్ వీక్నెస్ బయటపెట్టిన ఎన్టీఆర్..
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన వీక్నెస్ ను ఎన్టీఆర్ (NTR) గతంలో బయట పెట్టగా.. ఆ విషయాన్ని ఇప్పుడు అభిమానులు వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో ఎక్కువగా వీరిద్దరూ కలిసే ఉంటారు. వీరికి మహేష్ బాబు(Maheshbabu) కూడా మంచి ఫ్రెండ్. ఈ ముగ్గురు కూడా చాలా రోజులుగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబును కాస్త పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా ‘నాటు నాటు’ పాటకి ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ కూడా లభించింది. ఈ పాటలు వీరిద్దరూ కూడా తమ స్టెప్పులతో ఇరగదీశారు.
రామ్ చరణ్ వీక్నెస్ తో ఆడుకున్న ఎన్టీఆర్..
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ చరణ్ కి సంబంధించిన అతి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ లో మతిమరుపు లక్షణం ఉంది. అది పేర్ల విషయంలో.. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపటి తర్వాత అడిగితే చెప్పలేరు. ఒక అసిస్టెంట్ పేరు చెబితే, కాసేపు తర్వాత అతడిని మరోలా పిలిచేవాడు. ఆ తర్వాత ఇంకో పేరుతో పిలిచేవాడు. అదేంటని ఆ కుర్రాడిని అడిగితే పేరు తప్పు ఉన్న సార్ పిలిచేది తననే అని అర్థమవుతుందంటూ చెప్పేవాడు. పేరు సరి చేయడం ఇంపార్టెంట్ అనిపించలేదు అని కూడా అతను చెప్పాడట. ఇది విన్న యాంకర్ నా పేరు గుర్తుందా అని అడిగితే దొరికిపోయాడు రామ్ చరణ్. నవ్వుతూ దానిని కవర్ చేసేసాడు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ బలహీనతను బయటపెట్టి ఎన్టీఆర్ బాగా ఆడుకున్నాడు అని చెప్పవచ్చు.