Shiva Jyothi : చాలా మంది సెలబ్రిటీలు డబ్బుల కోసం కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంది యూత్ వీటికి బానిసై, ప్రాణాలు తీసుకుంటుండడంతో పోలీసులు ఇలాంటి వాళ్ల తాట తీసే పని పెట్టుకున్నారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కోసం తాము చేసిన ప్రమోషనల్ వీడియోలను డిలీట్ చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ శివ జ్యోతి (Shiva Jyothi) ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తుండడంతో ప్రముఖ యూట్యూబ్ యువ సామ్రాట్ రవి (Yuvasamrat Ravi) తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రాణాలు పోతున్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపని శివజ్యోతి
బెట్టింగ్ యాప్ల ఎంతో మంది యూత్ జీవితాలు నాశనం అవుతున్నాయి. వీటికి బానిసై చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల పై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, టీవీ యాంకర్స్ తదితరులు ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేస్తూ, జనాలను మరింత రిస్క్ లో పడేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షోకి వెళ్లి పాపులారిటీని సంపాదించిన చాలా మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లంతా డబ్బులకు కక్కుర్తి పడి జనాల ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లేదని మండిపడుతున్నారు నెటిజన్లు.
యువ సామ్రాట్ రవి బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుందంటూ మండిపడ్డాడు. చచ్చేవాడు చస్తున్నా ఆమె మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ని ఆపట్లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎంతోమందికి సాయం చేసి, సోషల్ మీడియా ద్వారా రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ బాగోతాన్ని బయట పెట్టి అందరి దృష్టిలో పడ్డాడు యువ సామ్రాట్ రవి. ఇప్పుడు ఆయనే స్వయంగా మళ్లీ శివ జ్యోతి బెట్టింగ్ బాగోతం గురించి బయట పెట్టడం సంచలనంగా మారింది.
సెలబ్రిటీల బాగోతాలు బయట పెడుతున్న అన్వేష్
అలాగే మరోవైపు ‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి బాగోతాలను బట్టబయలు చేస్తున్నారు. పేర్లతో సహా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో వారు సంపాదించిన ఆస్తులను కూడా బయట పెట్టి, వీడియోలు వదులుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు తాము ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ పెట్టిన వీడియోలని డిలీట్ చేస్తున్నారు. ప్రభుత్వం సైతం బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఒకరిద్దరూ యూట్యూబర్ లని అదుపులోకి తీసుకోగా, సెలబ్రిటీలు అలర్ట్ అయ్యి డ్యామేజ్ కంట్రోల్ పనులు మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ కి నో చెప్పండి అంటూ స్పెషల్ గా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సురేఖ వాణి కూతురు సుప్రీత సారీ చెబుతూ ఇలాంటి వీడియోనే పోస్ట్ చేయగా, తాజాగా రీతూ చౌదరి కూడా ఈ లిస్టులో చేరింది.