BigTV English

Samantha: వావ్..పెళ్లి గౌనును సమంత ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?

Samantha: వావ్..పెళ్లి గౌనును సమంత ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?

Samantha Wears Refurbished Wedding Gown, Pictures viral: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అనతి కాలంలో స్టార్ హీరోల సరసన నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన హవాను కొనసాగిస్తుంది. ఇటు సినిమాల్లోను.. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే చాలు అది ట్రెండింగ్ లో ఉండటం కంపల్సరీ.. అలాగే ఇప్పడు కూడా తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది.


తాజాగా సామ్ చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తన పెళ్లి నాటు గౌనును రీమోడలింగ్ చేయించింది ఈ బ్యూటీ. ముంబయి వేదికగా జరిగిన ఎల్లే సస్టైనబిలిటీ అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గోంది. ఈ ఫంక్షన్ లో సమంత నలుపు రంగు గౌను ధరించి స్టేజ్ పై హొయలొలికించింది. ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి నా ధన్యవాదాలు.

Also Read: నేను విజయం సాధించిన తర్వాత.. ఆ విషయంలో చాలా భయపడ్డాను: సమంత


ఆ అవార్డు ఫంక్షన్ కి నాకెంతో ఇష్టమైన నా మ్యారేజ్ డ్రస్సును రీమోడలింగ్ చేయించి ఆ డ్రస్సును ధరించాను. ఈ డ్రస్సును ఇంత అందంగా డిజైన్ చేసిన డిజైనర్ క్రేషా బజాజ్ కు ధన్యవాదాలు. నా అలవాట్లను మార్చుకోవడం, జీవనశైలిని మరింత స్థిరంగా, చేసుకోవడంతో పాటు పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చాలా థాంక్స్.. అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

సమంత నాగచైతన్య ఏ మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడి పెద్దల అంగాకారంతో 2017 అక్టోబర్ 6,7 న వీరిద్దరు ఒకటయ్యారు. రెండు సాంప్రదాయాల ప్రకారం హిందు, క్రైస్తవ పద్దతుల్లో వీరి వివాహం జరిగింది. క్రిస్టియన్ పద్ధతిలో జరిగినప్పుడు ధరించిన డ్రెస్సును బ్లాక్ కాక్ టైల్ స్ట్రాప్ లెస్ గౌనుగా మార్చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టా పేజ్ లో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

?utm_source=ig_embed&ig_rid=19571570-63f7-47a6-8378-7a5d9d3baa07">

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×